భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. చర్చలు రీషెడ్యూల్..
ABN , Publish Date - Feb 22 , 2026 | 03:58 PM
భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి చట్టబద్ధంగా తుది రూపును ఖరారు చేసేందుకు సోమవారం నుంచి ఇరు దేశాల అధికారుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి చట్టబద్ధంగా తుది రూపును ఖరారు చేసేందుకు సోమవారం నుంచి ఇరు దేశాల అధికారుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే (India US trade talks delay).
భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌కు సంబంధించి సోమవారం నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్‌లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం కావాల్సి ఉంది. అయితే అమెరికా సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ చర్చలు వాయిదా పడ్డాయి. ఇరు దేశాలకు అనుకూలమైన తేదీలలో చర్చలు తిరిగి నిర్వహించనున్నట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు (Trump tariff impact).
చాలా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే (US tariff policy setback). భారత్ మీద కూడా 50 శాతం సుంకాలు విధించారు. అయితే మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరడంతో ఆ సుంకాలు 50 నుంచి 18 శాతానికి తగ్గాయి. అమెరికా సుప్రీంకోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో ఆ సుంకాలు పది శాతానికి దిగి వచ్చాయి. కాగా, సుప్రీం తీర్పుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రపంచదేశాలపై సుంకాలను పది శాతానికి తగ్గించిన ట్రంప్.. తాజాగా వాటిని 15 శాతానికి పెంచారు.
ఇవీ చదవండి:
భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు
రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్