Share News

లేడీ బైకర్‌కు భయానక అనుభవం.. వెంటపడి వేధించిన యువకుడు..

ABN , Publish Date - May 08 , 2026 | 01:44 PM

తెల్లవారుజామున సముద్ర తీరంలో బైక్ రైడింగ్‌కు వెళ్లిన ఓ యువతికి భయానక అనుభవం ఎదురైంది. ఓ యువకుడు స్కూటీపై ఆమెను ఫాలో అవుతూ వేధింపులకు గురిచేశాడు.

లేడీ బైకర్‌కు భయానక అనుభవం.. వెంటపడి వేధించిన యువకుడు..
Mumbai stalking case

ముంబై, మే 8: తెల్లవారుజామున సముద్ర తీరంలో బైక్ రైడింగ్‌కు వెళ్లిన ఓ యువతికి భయానక అనుభవం ఎదురైంది. ఓ యువకుడు స్కూటీపై ఆమెను ఫాలో అవుతూ వేధింపులకు గురిచేశాడు. ఈ సంఘటన ముంబైలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితురాలు యువకుడి వేధింపులకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘అల్కా ఫిట్’‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో టెక్స్ట్ రూపంలో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వివరించి చెప్పింది.


‘ఈ రోజు నేను సముద్రం దగ్గర బైక్ రైడింగ్‌‌కు వెళ్లాను. ఓ వ్యక్తి నన్ను ఫాలో అవ్వటం మొదలెట్టాడు. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నాడు. నేను ఓ చోట బైక్ ఆపాను. అలా చేస్తే అతడు అక్కడినుంచి వెళ్లిపోతాడని అనుకున్నాను. కానీ, అతడు నాకు కొద్ది దూరంలో స్కూటీ ఆపాడు. కొద్దిసేపటి తర్వాత యూటర్న్ తీసుకుని వెనక్కు వచ్చాడు. నా ముందు కొద్దిదూరంలో స్కూటీ ఆపాడు. చాలా సేపు అతడు అక్కడే ఉన్నాడు. నా వైపు కళ్లు ఆర్పకుండా చూస్తున్నాడు. గ్రీన్ సిగ్నల్ పడ్డా కూడా అతడు వెళ్లలేదు’..


‘అతడు స్కూటీ స్టాండ్ వేసి, కిందకు దిగాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ పక్కకు వచ్చేశాడు. నా వైపు చూస్తూ ఉన్నాడు. తర్వాత మళ్లీ స్కూటీ దగ్గరకు వచ్చాడు. స్కూటీ దగ్గర నిలబడి నన్నే చూస్తున్నాడు. అతడు ఎందుకలా చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను దాన్ని మాటల్లో చెప్పలేను’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయమని యువతికి సలహా ఇస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పెన్షన్స్‌పై ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతున్నాం: ఎంపీ శివనాథ్

మామిడి పండ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?

Updated Date - May 08 , 2026 | 01:50 PM