Share News

మోసం చేసిన భర్త.. భార్య ఇచ్చిన షాకింగ్ ఆఫర్ ఏంటంటే..

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:55 PM

సాధారణంగా భర్త వేరే మహిళ మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తే ఏ భార్య అయినా బాధపడుతుంది. గొడవ పెట్టుకుని విడాకుల వరకు వెళ్తుంది. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం అలా చేయలేదు. భర్త మోసం బయటపడినప్పటికీ బాధలో కూరుకుపోకుండా వింత నిర్ణయం తీసుకుంది.

మోసం చేసిన భర్త.. భార్య ఇచ్చిన షాకింగ్ ఆఫర్ ఏంటంటే..
wife rents husband

సాధారణంగా భర్త వేరే మహిళ మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తే ఏ భార్య అయినా బాధపడుతుంది. గొడవ పెట్టుకుని విడాకుల వరకు వెళ్తుంది. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం అలా చేయలేదు. భర్త మోసం బయటపడినప్పటికీ బాధలో కూరుకుపోకుండా వింత నిర్ణయం తీసుకుంది. తన భర్తను అతడి ప్రియురాలికి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ ప్రతిపాదనకు భర్త బిత్తరపోయాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (wife rents husband).


థాయ్‌లాండ్‌కు చెందిన ఖున్ క్వాంగ్‌ అనే మహిళకు 21 ఏళ్ల వయసులో పెళ్లయింది. వారికి ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అంతా సవ్యంగానే ఉన్న సమయంలో భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచుగా ఇంటికి ఆలస్యంగా వస్తుండడం, ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వకుండా ఉండటం వంటి చర్యలతో ఖున్ క్వాంగ్‌‌కు అనుమానం మొదలైంది. తన అనుమానాలను నిర్ధారించుకోవడానికి, ఆ మహిళ ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించుకుంది. విచారణలో భర్త మరో మహిళను కలుస్తున్నాడని నిర్ధారించుకుంది (viral couple story).


వివాహేతర సంబంధం గురించి భర్తను నిలదీసింది. ఆమెకు దూరంగా ఉండలేనని భర్త తేల్చి చెప్పాడు (shocking relationship idea). ఆమెను వదిలి ఉండడం ఇష్టం లేదని చెప్పాడు. అతడి ప్రియురాలు కూడా అదే మాట చెప్పింది. దీంతో ఖున్ క్వాంగ్‌ ఓ వింత ప్రతిపాదన తెచ్చింది. ఆమె (ప్రియురాలు) కోరుకుంటే, తన భర్తతో కలిసి జీవించవచ్చని, అయితే దానికి బదులుగా ఆమె నెలకు 30,000 థాయ్ బాత్‌లు (దాదాపు ₹85,000) అద్దెగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. ప్రియురాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. అయితే ఆమె భర్త మాత్రం ఆ ఒప్పందాన్ని తిరస్కరించాడు. దీంతో ఆమె తన భర్త, ప్రియురాలిపై కేసు పెట్టింది.


ఇవి కూడా చదవండి..

సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..


మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 17 , 2026 | 05:55 PM