Share News

ఆత్మలకు ‘రెడ్‌ ఫాంటా’ నైవేద్యం

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:47 AM

మండే వేసవిలో కాస్త ఉపశమనం కోసం చల్లటి పానీయాలను తాగుతాం. కానీ అదే పానీయాన్ని ఆత్మలకు నైవేద్యంగా పెడతారక్కడ.

ఆత్మలకు ‘రెడ్‌ ఫాంటా’ నైవేద్యం

మండే వేసవిలో కాస్త ఉపశమనం కోసం చల్లటి పానీయాలను తాగుతాం. కానీ అదే పానీయాన్ని ఆత్మలకు నైవేద్యంగా పెడతారక్కడ. థాయ్‌లాండ్‌లో కనిపించే ఈ వింత దృశ్యం సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.

దేవతలకు పూజలు చేసి ధూపదీపాలు... పూలు, పండ్లు సమర్పించడం చూస్తుంటాం. కొబ్బరికాయలు, నైవేద్యాల సమర్పణ తెలిసిందే. కానీ థాయ్‌ ప్రజలు మాత్రం దేవుళ్లతో పాటు ఆత్మలను కూడా పూజిస్తుంటారు. ఆత్మలను సంతృప్తిపరిస్తే దుష్టశక్తులు దూరమవుతాయని, అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు. ఆత్మలను సంతృప్తిపరచడం కోసం విచిత్రంగా ‘రెడ్‌ ఫాంటా’ను నైవేద్యంగా సమర్పిస్తారు. థాయ్‌లాండ్‌లోని ఇళ్లు, దుకాణ సముదాయాల దగ్గర, రోడ్ల పక్కన అందంగా అలంకరించిన మందిరాలు కనిపిస్తాయి.


book7.2.jpgఅవి ప్రజలను రక్షించే, అదృష్టాన్ని తీసుకొచ్చే ఆత్మలకు నిలయాలుగా అక్కడి ప్రజలు భావిస్తారు. ఆ ఆత్మలను సంతోషంగా ఉంచడానికి ధూపదీపాలతో పాటు నైవేద్యంగా రెడ్‌ ఫాంటాను సమర్పిస్తారు. ఆత్మలు తాగేందుకు వీలుగా ఫాంటా సీసాలలో స్టా్ట్రలు కూడా వేస్తారు. బ్యాంకాక్‌లోని ఏ వీధిలో చూసినా ఇలాంటి ‘స్పిరిట్‌ హౌజ్‌’లు కనిపిస్తాయి. వాటి ముందు పూల దండలు, కొబ్బరికాయలతో పాటు రెడ్‌ ఫాంటా సీసాలు దర్శనమిస్తాయి.


‘స్పిరిట్‌’ డ్రింక్‌...

థాయ్‌లాండ్‌లో 95 శాతం మంది బౌద్ధమతాన్ని ఆచరించే వారే అయినప్పటికీ ప్రతీ ఇంటి దగ్గర ‘స్పిరిట్‌ హౌజ్‌’ కనిపిస్తుంది. అందులో ఆత్మలు ఉంటాయని నమ్ముతారు. అప్పుడప్పుడు ఆ ఆత్మలను చిన్న చిన్న బహుమతులతో శాంతింప చేస్తుంటారు. కొబ్బరి జెల్లీలు, స్వీట్‌, స్ట్రాబెర్రీ ఫాంటా... ఇలా రకరకాల పదార్థాలను సమర్పిస్తుంటారు. బ్యాంకాక్‌లో నివసించే చాలామంది చైనా నుంచి వలస వచ్చినవారే. వాళ్లంతా ఎరుపు రంగు శుభప్రదమైనదిగా భావిస్తారు. అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని విశ్వసిస్తారు. స్ట్రాబెర్రీ ఫాంటా తీపిని, ఎరుపు రంగు సౌలభ్యాన్ని సూచిస్తుంది. ఎరుపు రంగు ఆనందం, శక్తి, రక్షణకు ప్రతీకగా ఉంటుంది.


book7.3.jpgఅంతేకాకుండా అదృష్టాన్ని ఆకర్షిస్తుందని, దుష్టశక్తులను దూరం చేస్తుందని నమ్మకం. ఎరుపు రంగు ద్రావణాన్ని ఆత్మలకు అందించడానికి ప్రధాన కారణమిదే. ఎరుపు రంగుతో శక్తిమంతమైన ఆత్మలను ప్రసన్నం చేసుకోవచ్చని నమ్ముతారు. థాయ్‌ సంస్కృతిలో ఇదో భాగం. ‘ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే’ అని రోడ్డు పక్కన ఫాంటాలు అమ్మే 50 ఏళ్ల చాట్‌గ్యూ పింగ్‌లై అంటారు. కొన్నేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మరో విశేషమేమంటే... ఫాంటా అమ్మకాల్లో థాయ్‌ ప్రపంచంలో నాలుగో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ

Read Latest Telangana News and National News

Updated Date - Mar 01 , 2026 | 11:47 AM