Share News

దుకాణంలోకి చొరబడ్డ ఏనుగు.. భయంతో పరుగులు తీసిన కస్టమర్లు..

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:50 PM

ఆకలితో ఉన్న ఓ ఏనుగు అడవి నుంచి జనావాసంలోకి వచ్చేసింది. అడవికి దగ్గరగా ఉన్న ఓ దుకాణంలోకి చొరబడింది. తనకు నచ్చనవి తినేసి వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన పాత వీడియో మరో సారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దుకాణంలోకి చొరబడ్డ ఏనుగు.. భయంతో పరుగులు తీసిన కస్టమర్లు..
wild elephant viral video

ఇంటర్‌నెట్ డెస్క్: ఆకలితో ఉన్న ఓ ఏనుగు అడవి నుంచి జనావాసంలోకి వచ్చేసింది. అడవికి దగ్గరగా ఉన్న ఓ దుకాణంలోకి చొరబడింది. దుకాణంలో బీభత్సం సృష్టించింది. తనకు నచ్చిన ఆహారాన్ని తిని అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. పక్ చాంగ్‌ ప్రాంతంలో ఆకలితో ఉన్న ప్లాయ్ బియాంగ్ లెక్ అనే ఏనుగు ఆహారం కోసం ఖావో యాయ్ నేషనల్ పార్క్ నుంచి జనావాసంలోకి వచ్చింది. అడవికి దగ్గరగా.. రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణంలోకి చొరబడింది.


ఆ ఏనుగును చూడగానే కస్టమర్ల గుండెలు ఝల్లుమన్నాయి. భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. ఆ ఏనుగు తాపీగా తనకు కావాల్సిన ఆహారాన్ని తినేసింది. ఈ నేపథ్యంలోనే దుకాణాన్ని కొద్దిగా ధ్వంసం చేసింది. తర్వాత మెల్లగా అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ ఏనుగు తరచుగా జనావాసాల్లోకి వస్తుంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏనుగు దుకాణంలోకి చొరబడి ఆహారం తింటున్న దృశ్యాలు ఉన్నాయి.


అయితే, ఈ సంఘటన గతేడాది జూన్ నెలలో జరిగినట్లుగా తెలుస్తోంది. పాత వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ ఏనుగు రెగ్యులర్ కస్టమర్ అయినట్లుగా ఉంది. ఎంతో ధీమాగా అన్నీ తినేసి వెళ్లిపోతోంది’..‘మర్యాద తెలిసిన ఏనుగులా ఉంది. పెద్దగా డ్యామేజ్ చేయకుండానే తినేసి వెళ్లిపోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్ తరలిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

యూఏఈకి చేరిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్..

Updated Date - Apr 27 , 2026 | 01:57 PM