పెళ్లి కూతురిపై డబ్బుల వర్షం.. ఎన్ని లక్షలు చల్లారంటే..
ABN , Publish Date - Feb 18 , 2026 | 03:00 PM
పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడి కుటుంబసభ్యులు దేశం మొత్తం ఆశ్చర్యపడే పని చేశారు. పెళ్లి కూతురిపై డబ్బుల వర్షం కురిపించారు. అది కూడా లక్షల రూపాయల్ని వధువుపై చల్లారు.
ఇంటర్‌నెట్ డెస్క్: పంజాబ్‌లో జరిగిన ఓ పెళ్లి ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పెళ్లి వేడుకలో వరుడి కుటుంబసభ్యులు దేశం మొత్తం ఆశ్చర్యపడే పని చేశారు. పెళ్లి కూతురిపై డబ్బుల వర్షం కురిపించారు. అది కూడా లక్షల రూపాయల్ని వధువుపై చల్లారు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తరన్‌తరన్ జిల్లాలో తాజాగా ఓ పెళ్లి జరిగింది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత వరుడు, వధువు ఓ చోట నిల్చున్నారు. ఓ వ్యక్తి వారి దగ్గరకు పెద్ద బ్యాగ్ తీసుకువచ్చాడు. పెళ్లి కుమారుడు ఆ బ్యాగులోనుంచి డబ్బుల కట్టలు తీశాడు.
కట్టల నుంచి నోట్లను వేరు చేసి పెళ్లి కూతురిపై చల్లటం మొదలెట్టాడు. బ్యాగులోని డబ్బు మొత్తం ఖాళీ అయ్యే వరకు అలా చల్లుతూనే ఉన్నాడు. కేవలం వరుడు మాత్రమే కాదు.. వరుడి కుటుంబసభ్యులు కూడా వధువుపై డబ్బులు చల్లారు. వధువు కుటుంబం చల్లిన డబ్బు మొత్తం 8.5 కోట్ల రూపాయలు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. డీజే, పెళ్లికి వచ్చిన కొంతమంది మాత్రం.. ఆ డబ్బు విలువ 2 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. వాటిలో ఇండియన్ కరెన్సీతో పాటు డాలర్లు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే, మొత్తం డబ్బు ఎంత అనేది తెలియరాలేదు. వధువుపై డబ్బులు చల్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ వీడియోలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది వరుడి కుటుంబం చేసిన పనిని సమర్ధిస్తుంటే.. మరి కొంతమంది తప్పుబడుతున్నారు. ‘అది వాళ్ల డబ్బు.. వాళ్ల ఇష్టం వచ్చినట్లు చేసుకుంటారు’..‘అలా డబ్బులు పారేసే బదులు.. పేద వాళ్లకు పంచి పెట్టుంటే చాలా సంతోషపడేవారు’..‘ఆ వీడియో ఏఐ అయితే బాగుంటుంది’..‘అవి ఫేక్ నోట్లు అయి ఉండొచ్చు. మీరు ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారు’..‘ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో.. ఏది అబద్ధమో అర్థం కావటం లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇమ్రాన్ హత్యకు కుట్ర.. మమ్మల్ని మొహ్సిన్ బెదిరిస్తున్నారు.. మాజీ ప్రధాని సోదరీమణుల ఆరోపణలు..
దారుణం.. భర్తను చున్నీతో ఉరేసి చంపిన భార్య