నడిరోడ్డుపై ఖడ్గ మృగాల భీకర పోరు.. బెంబేలెత్తిన జనం..
ABN , Publish Date - May 12 , 2026 | 08:29 AM
అడవిలో ఉండాల్సిన రెండు ఖడ్గ మృగాలు జనావాసంలోకి వచ్చేశాయి. నడి రోడ్డుపై భీకర పోరుకు దిగాయి. ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి. ఖడ్గ మృగాల గొడవ కారణంగా టూరిస్టులు, స్థానిక జనం భయపడిపోయారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అడవిలో ఉండాల్సిన రెండు ఖడ్గ మృగాలు జనావాసంలోకి వచ్చేశాయి. నడి రోడ్డుపై భీకర పోరుకు దిగాయి. ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి. ఖడ్గ మృగాల గొడవ కారణంగా టూరిస్టులు, స్థానిక జనం భయపడిపోయారు. ఖడ్గ మృగాలు అక్కడినుంచి వెళ్లిపోయే వరకు బిక్కుబిక్కుమంటూ బతికారు. ఈ సంఘటన నేపాల్‌లో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్వాన్ జిల్లాలోని సౌరాహా గ్రామం ‘చిత్వాన్ నేషనల్ పార్క్’కు అత్యంత సమీపంలో ఉంది. ఈ గ్రామానికి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు.
ఆదివారం ఓ రెండు ఖడ్గ మృగాలు అడవినుంచి గ్రామంలోకి వచ్చాయి. ఓ ఖడ్గ మృగం మరో ఖడ్గ మృగంతో గొడవ పెట్టుకుంది. ఆ రెండూ నడిరోడ్డుపై గట్టిగా అరుస్తు కొమ్ములతో కుమ్ముకున్నాయి. రెండింటి మధ్య కొన్ని నిమిషాల వరకు భీకర పోరు నడిచింది. ఇది చూసిన టూరిస్టులు, గ్రామస్తులు భయపడిపోయారు. షాపుల యజమానులు షాపులను వదిలేసి అక్కడినుంచి పారిపోయారు. మరికొందరు షట్టర్ వేసి షాపులో దాక్కున్నారు. అవి గొడవ పడుతూ అక్కడినుంచి దూరంగా పారిపోయాయి.
ఓ టూరిస్టు దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘వన్య ప్రాణులను చూడ్డానికి చిత్వాన్ వచ్చాను. కానీ, వన్య ప్రాణులే నా కోసం వస్తాయని అనుకోలేదు. ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు రెండు గ్రామంలోకి ప్రవేశించాయి. వీధుల్లో భీకరంగా గొడవపడ్డాయి. ఈ గొడవ కారణంగా ఎవ్వరికీ ఏమీ కాలేదు. అందరూ నోర్లు వెల్లబెట్టి గొడవ చూస్తూనే ఉన్నారు’ అని రాసుకొచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ఉదయాన్నే రాగి జావ తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!