ఏటీఎమ్‌లో సాంకేతిక లోపం.. రూ. 100 నోటుకు బదులు రూ. 500
ABN , Publish Date - May 18 , 2026 | 07:46 AM
ఏటీఎమ్‌లో సాంకేతిక లోపం కారణంగా 100 రూపాయల నోటుకు బదులు 500 రూపాయల నోట్లు వచ్చాయి. విషయం తెలిసిన జనం పెద్ద సంఖ్యలో ఏటీఎమ్ సెంటర్ వద్దకు క్యూ కట్టారు.
ముంబై, మే 18: ఏటీఎమ్‌లో సాంకేతిక లోపం కారణంగా 100 రూపాయల నోటుకు బదులు 500 రూపాయల నోట్లు వచ్చాయి. విషయం తెలిసిన జనం పెద్ద సంఖ్యలో ఏటీఎమ్ సెంటర్ వద్దకు క్యూ కట్టారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. వాసాయ్, గోలనీ నాకకు చెందిన ఓ వ్యక్తి డబ్బులు విత్ డ్రా చేయడానికి హిటాచీ ఏటీఎమ్ సెంటర్‌కు వెళ్లాడు. 100 రూపాయలు విత్ డ్రా చేశాడు. అయితే, 100 రూపాయలకు బదులు 500 రూపాయల నోటు బయటకు వచ్చింది. అకౌంట్ నుంచి కేవలం 100 మాత్రమే డెబిట్ అయింది.
మరో వ్యక్తి 400 రూపాయలు విత్ డ్రా చేయగా.. 2 వేల రూపాయలు వచ్చాయి. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా స్థానిక జనానికి తెలిసి పోయింది. జనం పెద్ద ఎత్తున ఏటీఎమ్ సెంటర్‌కు క్యూ కట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఏటీఎమ్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. జనాన్ని అక్కడినుంచి పంపేశారు. బ్యాంకు అధికారులకు సమాచారం వెళ్లింది. సాంకేతిక లోపం కారణంగా 100 రూపాయలకు బదులు 500 రూపాయల నోట్లు వస్తుండొచ్చని అధికారులు తెలిపారు. బ్యాంక్ టెక్నికల్ టీమ్ ఏటీఎమ్ సెంటర్‌కు చేరుకున్నారు.
సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు. సమస్య పరిష్కారం అయిన తర్వాతే ఆ ఏటీఎమ్ సేవలు పున:ప్రారంభం అవుతాయని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘100 రూపాయల సెక్షన్‌లో 500 రూపాయలు పెట్టి ఉంటారు. అందుకే 100 రూపాయలు విత్ డ్రా చేస్తుంటే 500 రూపాయలు వస్తున్నాయి’..‘ఇలా జరగటం కొత్తేమీ కాదు.. చాలా సార్లు జరిగింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మెక్సికోలో మళ్లీ కాల్పులు.. 10 మంది మృతి
ఎయిర్ షో సందర్భంగా అపశృతి.. గాల్లో ఢీకొట్టుకున్న యుద్ధ విమానాల