రెయిన్ ఎఫెక్ట్.. మెట్రో స్టేషన్‌లో అత్యంత ప్రమాదకరమైన పాము..
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:56 PM
ముంబై మెట్రో స్టేషన్‌లో అత్యంత విషపూరితమైన రక్త పింజరి పాము కలకలం సృష్టించింది. మెట్రో స్టేషన్ బేస్‌మెంట్‌లో తిరుగుతున్న దాన్ని చూసిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూ సిబ్బంది మెట్రో స్టేషన్‌కు చేరుకుని పామును పట్టుకుని వెళ్లిపోయారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ముంబై మెట్రో స్టేషన్‌లో అత్యంత విషపూరితమైన రక్త పింజరి పాము కలకలం సృష్టించింది. మెట్రో స్టేషన్ బేస్‌మెంట్‌లో తిరుగుతున్న దాన్ని చూసిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూ సిబ్బంది మెట్రో స్టేషన్‌కు చేరుకుని పామును పట్టుకుని వెళ్లిపోయారు. ఆ వివరాల్లోకి వెళితే.. వర్షాల కారణంగా సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో బాంద్రా - కుర్లా మెట్రో లైన్ 3 స్టేషన్‌లోని బేస్‌మెంట్‌లోకి రక్త పింజరి వచ్చింది. అది అక్కడి ఫ్లోర్‌పై అటు, ఇటు తిరసాగింది. ఇది గమనించిన ప్రయాణికులు భయపడిపోయారు.
అక్కడినుంచి దూరంగా పరిగెత్తారు. ఈ నేపథ్యంలోనే మెట్రో సిబ్బంది స్నేక్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. మెట్రో స్టేషన్‌కు చేరుకున్న స్నేక్ రెస్క్యూ సిబ్బంది.. నీళ్ల బాటిల్ సాయంతో పామును పట్టుకున్నారు. సురక్షితంగా దాన్ని అక్కడినుంచి తరలించారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వర్షాలు మొదలయ్యాయి కదా.. పాములు ఎక్కడినుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణిస్తాయి’..‘వర్షాకాలం అంటే పాముల కాలం. చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆహారం తిన్న పళ్లెంలో చేతులు కడుక్కోకూడదట.. ఎందుకో తెలుసా?
ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా.. రిటైర్మెంట్ వయసు పెంపు, 11 వేల మందికి OPS