సీఎం విజయ్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్..
ABN , Publish Date - May 19 , 2026 | 06:53 AM
ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ని కలిశారు. ముఖ్యమంత్రికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ని చూడగానే విజయ్ ఎంతో సంతోషించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ని కలిశారు. ముఖ్యమంత్రికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ని చూడగానే విజయ్ ఎంతో సంతోషించారు. అందరికీ ఆ గిఫ్ట్ సాధారణ కారు నంబర్ ప్లేట్‌లా కనిపించినా.. విజయ్‌కి మాత్రం స్పెషలే. ఆ నంబర్ ప్లేట్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది. విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్)’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో హీరో విజయ్ వాడిన కారు నంబర్ ప్లేట్‌పై ‘TN07 CM 2026’ అని ఉంటుంది. విజయ్ సీఎం కావాలని బలంగా కోరుకుంటూ దర్శకుడు ఈ నంబర్ ప్లేట్‌ను సిద్ధం చేశారు. సీన్ కట్ చేస్తే విజయ్ నిజంగానే 2026 ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకుని తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలోనే వెంకట్ ప్రభు ముఖ్యమంత్రి విజయ్‌కి ఆ నంబర్ ప్లేట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. నిన్న (సోమవారం) సాయంత్రం విజయ్‌ని కలిసి ఆ నంబర్ ప్లేట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
‘ఒక చరిత్ర ఆవిష్క్రతమైంది. ఒక ఆలోచన నుంచి.. విజన్ వరకు.. ఆపై ఈ క్షణం వరకు. ఈ రోజు మన గౌరవనీయులైన సీఎం విజయ్‌ని కలిసి.. గోట్ సినిమాలోని మొట్టమొదటి మేనిఫెస్టేషన్( విజయ్ సీఎం కావాలని కోరుకుంటూ రూపొందించిన నంబర్ ప్లేట్) వారికి బహుకరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఆరంభమే’ అని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
పట్టిసీమతో ఐదేళ్లలో 50,000 కోట్ల సంపద