తొమ్మిదేళ్ల పాటు డబ్బులు దాచి ఆ మహిళ ఏం చేసిందంటే..
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:06 PM
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ చేసిన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తొమ్మిది సంవత్సరాల పాటు దాచిన డబ్బుతో ఎవ్వరూ ఊహించని పని చేసి కుటుంబ సభ్యులను సర్‌ప్రైజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
పాట్నా: సాధారణంగా చాలా మంది మహిళలకు డబ్బులు దాచుకునే అలవాటు ఉంటుంది. భర్త లేదా పుట్టింటి వారు ఇచ్చిన నగదును అలాగే ఏళ్ల తరబడి అట్టిపెడుతుంటారు. కొన్నేళ్లు గడిచిన తర్వాత తాము దాచుకున్న సొమ్మంతా బయటకు తీసి సంతోషపడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ అలాంటి పనే చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తొమ్మిది సంవత్సరాల పాటు దాచిన డబ్బుతో ఎవ్వరూ ఊహించని పని చేసి కుటుంబ సభ్యులను సర్‌ప్రైజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీక్షా జైస్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో ప్రకారం.. 2017 నుంచి డబ్బు దాచుకుంటూ వచ్చిన ఆమె.. చివరకు ఆ పొదుపుతో ఏం సాధించిందో వీడియో ద్వారా చూపించింది. మొదట తన పిగ్గీ బ్యాంక్‌ను ఖాళీ చేస్తూ కనిపించిన దీక్షా.. అందులో నుంచి నోట్లు, నాణేలను బయటకు తీసింది. ఆ తర్వాత చేతిలో బ్యాగ్‌తో కనిపిస్తూ.. ఏడు, ఎనిమిది నగదు కట్టలను బయటకు తీసింది. వీటి విలువ దాదాపు లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. అనంతరం ఇంత మొత్తాన్ని ఆమె దేనికి ఉపయోగించబోతుందోననే ఆసక్తి నెలకొంది.
చివరికి దీక్షా అసలు విషయం రివీల్ చేసింది. ఆ డబ్బుతో కారు, ఫోన్, బంగారం లాంటి వస్తువులు కొనకుండా ఏకంగా ఓ ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనంతరం తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్లాట్ వద్ద దీక్షా సంతోషంగా ఫొటోలు దిగింది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి దాచుకున్న డబ్బుతో స్థలం కొనుగోలు చేయడంతో దీక్షా ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. మరోవైపు, వీడియోపై ‘2017 నుంచి డబ్బు దాచుకుంటూ ఏం సాధించారు?’ అనే క్యాప్షన్ కూడా ఆమె పెట్టింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు దీక్షాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు దాచిన డబ్బుతో విలాస వస్తువులు కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భూమి కొనుగోలు చేయడంతో అభినందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీఎన్‌జీ ధరలకు మళ్లీ రెక్కలు.. కిలోకు రూ.3.89 పెంపు..
నేపాల్‌కు పొంచి ఉన్న మరో ప్రమాదం.. కొత్తగా రెండు హిమ సరస్సుల గుర్తింపు..