రౌడీ షీటర్‌తో మహిళా కానిస్టేబుల్ జంప్! ఆగిపోయిన పెళ్లి
ABN , Publish Date - Feb 12 , 2026 | 10:52 PM
పెళ్లి కొద్ది రోజుల్లో ఉందనంగా ఓ మహిళా కానిస్టేబుల్ రౌడీ షీటర్‌తో వెళ్లిపోయిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: తన పెళ్లికి కొద్ది రోజుల ముందు మహిళా కానిస్టేబుల్ ఓ రౌడీ షీటర్‌తో వెళ్లిపోవడంతో వివాహం నిలిచిపోయింది. యూపీలోని మీరట్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది.
బాసుమా ప్రాంతానికి చెందిన సంధ్యా భరద్వాజ్ కానిస్టేబుల్‌గా చేస్తున్నారు. ఆమెకు ముజఫర్‌నగర్‌కు చెందిన మరో కానిస్టేబుల్ అతుల్ శర్మతో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు తమతమ బంధువులు, స్నేహితులకు ఆహ్వానాలు కూడా పంపించాయి. పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
అయితే, శనివారం వధువు కనిపించకుండా పోవడంతో తండ్రి శుభాష్ శర్మ ఆమె కోసం పలు చోట్ల వెతికారు. ఫలితం లేకపోవడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురి ప్రియుడు అంకిత్ చౌహాన్ గురించి తెలిపారు. అతడు తన కూతురిని కిడ్నాప్ చేశాడని ఆరోపించారు. చౌహాన్ ఒక రౌడీ షీటర్ అని తెలిపారు. ఫిబ్రవరి 5న అతడు తనకు కాబోయే అల్లుడికి ఫోన్ చేసి బెదిరించాడని ఫిర్యాదు శుభాష్ చేశారు. సంధ్యను పెళ్లిచేసుకుంటే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని అన్నారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలకు చేపట్టారు. బక్సర్ జిల్లాలో సంధ్య ఉన్నట్టు గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆమెను ప్రశ్నించగా తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని సంధ్య తేల్చి చెప్పింది. తనంతట తానుగా చౌహాన్ కోసం ఇంటిని వీడినట్టు వెల్లడించింది.
ఇక చౌహాన్‌పై పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఒక మద్యం షాపులో చోరీ కేసులో గతేడాది అరెస్టైన అతడు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడని తెలిపారు. ఇక సంధ్య తనంతట తానుగా చౌహాన్‌తో వెళ్లిపోయానని చెప్పడంతో వరుడి కుటుంబం పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది.
ఈ వార్తలూ చదవండి:
భారతీయ కుటుంబానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన దుబాయ్ పాలకుడు
లాటరీ టిక్కెట్లపై రూ.1.17 కోట్ల ఖర్చు! చివరకు ఏం జరిగిందంటే..