విద్యార్థుల అద్భుత సృష్టి.. స్క్రాప్‌తో తయారు చేసిన 'F-22 రాప్టర్' ఫైటర్ జెట్.. వీడియో వైరల్
ABN , Publish Date - Mar 16 , 2026 | 09:43 PM
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే మౌలిక సదుపాయాల కొరత, పరిమిత వననులు గుర్తుకు వస్తాయి. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆ అంచనాలను తలకిందులు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే మౌలిక సదుపాయాల కొరత, పరిమిత వనరులు గుర్తుకు వస్తాయి. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాకు చెందిన ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆ అంచనాలను తలకిందులు చేశారు. తమ మేధస్సుతో, పనికిరాని వస్తువులో ఏకంగా గాలిలో ఎగిరే F-22 రాఫ్టర్ యుద్ధ విమాన నమూనాను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్ లోని భిలావాలిలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్క్రాప్ మెటీరియల్స్‌తో ఎగిరే F-22 చాప్టర్ మోడల్‌ను రూపొందించారు. ఆశిష్ కుమార్ అనే ఉపాధ్యాయుడి నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ గ్రామీణ పాఠశాలలో విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ మోడల్ తయారీకి తేలికపాటి థర్మకోల్ ఉపయోగించారు. ఇందులోని ప్రాథమిక భాగాలకు సుమారు రూ.6,000లు ఖర్చు చేసినట్లు ఆశిష్ కుమార్ తెలిపారు. 4 నుంచి 8 తరగతుల వరకు ఐదుగురు విద్యార్థులు ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ విమానాన్ని రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. 1-1.5 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుందని ఆశిశ్ తెలిపారు.
పుస్తకాల్లోని పాఠాలను కేవలం బట్టీ పట్టకుండా, వాటిని ప్రయోగాత్మకంగా చేసి చూపడం వల్ల విద్యార్థుల్లో ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెరుగుతుందని ఈ ఘటన నిరూపించింది. సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఉంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు చేయగలరని భిలావాలి విద్యార్థులు నిరూపించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ వీడియో వైరల్ గా మారడంతో, నెటిజన్లు, విద్యా అధికారులు విద్యార్థులను ప్రశంసిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బాబోయ్ పెద్దపులి… 16 రోజులుగా గ్రామాల్లో సంచారం
జనసేన బలోపేతానికి కృషి : నాగబాబు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్