Share News

Heartwarming love story: యుక్త వయసులో విడిపోయారు.. 65 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు..

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:19 PM

అన్ని ప్రేమలు పెళ్లి వరకు చేరుకోలేవు. పలు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోతాయి. అయితే కొందరు మాత్రం ఎప్పటికీ తమ మొదటి ప్రేమను మర్చిపోలేరు. తాజాగా కేరళలోని ఓ వింటేజ్ లవ్‌స్టోరీ గురించి తెలిస్తే హృదయం ద్రవించక మానదు.

Heartwarming love story: యుక్త వయసులో విడిపోయారు.. 65 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు..
couple reunites after decades

అన్ని ప్రేమలూ పెళ్లి వరకు చేరుకోలేవు. పలు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోతాయి. అయితే కొందరు మాత్రం ఎప్పటికీ తమ మొదటి ప్రేమను మర్చిపోలేరు. తాజాగా కేరళలోని ఓ వింటేజ్ లవ్‌స్టోరీ గురించి తెలిస్తే హృదయం ద్రవించక మానదు. యవ్వనంలో విడిపోయిన ప్రేమికులు 65 ఏళ్ల వయసులో పిల్లల చొరవతో పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ కథ అందర్నీ ఆకట్టుకుంటోంది (true love reunion).


కేరళలోని ముందక్కల్‌కు చెందిన జయప్రకాష్, రష్మి యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అయితే తమ ప్రేమ గురించి పెద్దవాళ్లకు చెప్పడానికి భయపడ్డారు. దీంతో రష్మికి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి చేసేశారు. జయప్రకాష్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత జయప్రకాష్ కూడా పెళ్లి చేసుకుని స్థిరపడిపోయాడు. ఇద్దరికీ పిల్లలు ఉన్నారు. పదేళ్ల క్రితం రష్మి భర్త చనిపోయాడు. జయప్రకాష్ ఐదేళ్ల క్రితం భార్యను కోల్పోయాడు (emotional love story).


భర్తను కోల్పోయిన రష్మి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించడం ప్రారంభించింది (reunited after 40 years). రష్మిని ఒక షార్ట్ ఫిల్మ్‌లో చూసిన జయప్రకాష్ ఆమెను సంప్రదించాడు. పాత జ్ఞాపకాలను, ప్రేమను పంచుకున్నాడు. వారి ఇద్దరు పిల్లలు చాలా పెద్ద మనసుతో ఆలోచించి వారిని ఒక్కటి చేశారు. పిల్లల సమక్షంలో వారిద్దరూ కొచ్చిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. స్వచ్ఛమైన ప్రేమ.. ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని చేరుకుంటుందని జయప్రకాష్, రష్మి నిరూపించారు.


ఇవి కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. ఏడాదిలో లక్ష వీసాలు రద్దు..

Updated Date - Jan 13 , 2026 | 03:04 PM