ఛీ.. ఇంత దారుణమా? సమోసాల ట్రేపై కాళ్లు పెట్టి ఫోన్‌లో కబుర్లు.. నెటిజన్ల ఫైర్!
ABN , Publish Date - May 27 , 2026 | 07:45 PM
రైల్లో తరుచూ కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సమోసాలు ఉన్న ట్రేని నేలపై పెట్టడమే కాకుండా.. కాళ్లను సమోసాల బుట్టపైనే ఉంచాడో వ్యాపారి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు..
ఇంటర్నెట్ డెస్క్: మనకు తెలియకుండా మనం తినే ఆహార పదార్థాలు ఎంత అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్నాయో, ఎలా నిల్వ చేయబడుతున్నాయో చూపించే అనేక వీడియోలు తరచూ సోషల్ మీడియాలో కలకలం రేపుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో తెగ వైరల్ అవుతోంది. రైల్వే ప్రయాణికుల ఆరోగ్యంతో కొందరు విక్రేతలు ఎలా ఆటలాడుకుంటున్నారో.. ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కదులుతున్న రైల్లో సమోసాలు విక్రయిస్తున్నాడు. అయితే అతను సమోసాలు ఉన్న ట్రేని నేలపై పెట్టడమే కాకుండా, తన కాళ్లను ఆ సమోసాల బుట్టపైనే ఉంచాడు. ఒక కాలును సమోసాల ట్రేపై పెట్టి, ఫోన్‌లో ఎవరితోనో నవ్వుతూ కబుర్లు చెబుతున్నాడు.
ఈ వీడియో @Mrs_Tyagiji అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘రుచికరమైన సమోసాలు, బురద, నూనె, పాదాల మురికి అన్నీ కలిపి తినండి" ’ అని, ‘ప్రయాణికుల ఆరోగ్యంతో ఆడుకునే ఇలాంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీగా ఎమ్మార్వోలు బదిలీ
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్
For More AP News