Painter salary: కార్పొరేట్ ఉద్యోగులైనా ఆసూయ పడాల్సిందే.. ఈ పెయింటర్ ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:17 PM
ప్రస్తుతం కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్థులే బాగా సంపాదిస్తున్నారని అందరూ అనుకుంటుంటారు. ఇతర పనులు చేసే వారిని చులకనగా చూస్తారు. ముఖ్యంగా పెయింటర్లు, మెకానిక్‌లు, రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్స్ నడిపేవాళ్ల సంపాదన చాలా తక్కువని భావిస్తారు.
ప్రస్తుతం కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్థులే బాగా సంపాదిస్తున్నారని అందరూ అనుకుంటుంటారు. ఇతర పనులు చేసే వారిని చులకనగా చూస్తారు. ముఖ్యంగా పెయింటర్లు, మెకానిక్‌లు, రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్స్ నడిపేవాళ్ల సంపాదన చాలా తక్కువని భావిస్తారు. అలాంటి వాళ్లకు తాజాగా ఓ పెయింటర్ షాకిచ్చాడు. అతడి సంపాదన ఎంతో తెలిస్తే పెద్ద పెద్ద సంస్థల్లో పని చేసే ఉద్యోగస్తులు కూడా అసూయపడాల్సిందే (Painter income).
saniya.mirzzaa అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక పెయింటర్ ఒక భవనానికి తాడుతో వేలాడుతూ పెయింట్ చేస్తున్నాడు. అతడితో ఓ అమ్మాయి మాట్లాడుతూ.. 'నడుముకు కట్టిన తాడు వల్ల నొప్పి వేయడం లేదా' అని అడిగింది. దానికి అతడు స్పందిస్తూ.. 'లేదు.. బెల్ట్ పెట్టుకోవడం వల్ల బాగానే ఉంద'ని చెప్పాడు. ఆ తర్వాత 'ఎంత సంపాదిస్తున్నావు' అని అడిగింది. దానికి అతడు షాకింగ్ సమాధానం ఇచ్చాడు (Painter earns better than employee).
పెయింటింగ్ పని చేయడం ద్వారా నెలకు రూ.35 వేల వరకు సంపాదిస్తానని చెప్పాడు (painter viral video). అలాగే చెరుకు పంట ద్వారా ఏడాదికి రూ.10 లక్షలకు పైగానే సంపాదిస్తున్నానని చెప్పాడు. దాంతో షాకైన ఆ అమ్మాయి.. 'నువ్వ మా డిగ్రీ పట్టాలపై ఉమ్మి వేశావు' అని చెప్పింది. దానికి అతడు స్పందిస్తూ.. తాను కూడా డిగ్రీ చేశానని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను కోట్ల మంది వీక్షించారు. పది లక్షల మందికి పైగా లైక్ చేశారు.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..