Share News

Girl viral clip: వీళ్లకు నరకంలో కఠిన శిక్ష విధించాలి.. అమ్మాయి మేకప్ వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..

ABN , Publish Date - Jan 06 , 2026 | 10:21 AM

సోషల్ మీడియాలో నవ్వు తెప్పించే ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ అమ్మాయి మేకప్‌నకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు

Girl viral clip: వీళ్లకు నరకంలో కఠిన శిక్ష విధించాలి.. అమ్మాయి మేకప్ వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..
hocking Make up video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నవ్వు తెప్పించే ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ అమ్మాయి మేకప్‌నకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు (viral girl video).


@MemeCreaker అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తోంది. ఆ యువతి కెమెరా ముందు కర్చీఫ్‌తో తన మొహం మీద మేకప్‌ను తుడుచుకుంటోంది. అలా మేకప్ తుడుస్తున్న కొద్దీ తెల్లగా ఉన్న ఆ అమ్మాయి మొహం నల్లగా మారిపోయింది. ఆ వీడియోలో మొదట కనిపించిన అమ్మాయి, మేకప్ తుడిచేసిన తర్వాత కనిపించిన అమ్మాయి ఒక్కరే అంటే నమ్మడం కాస్త కష్టమే. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (viral Make up video).


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.5 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు (shocking parlor video). కొన్ని వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'వామ్మో.. ఏఐ కూడా ఈ ఇద్దరూ ఒక్కరే అని కనిపెట్టలేదు' అని ఒకరు కామెంట్ చేశారు. ఈ పార్లర్ వ్యక్తులకు నరకంలో ప్రత్యేకంగా శిక్షలు విధించాలని మరొకరు ఫన్నీగా పేర్కొన్నారు. ఇంతకు మించిన మోసం మన దేశంలో ఎవ్వరూ చేయలేరని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..


వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా సత్యసాయి బాబా భక్తురాలు..

Updated Date - Jan 06 , 2026 | 10:21 AM