ఆకాశంలో ఊహించని ప్రమాదం.. అది లేకపోతే ఆమె ప్రాణాలు పోయేవి..
ABN , Publish Date - May 25 , 2026 | 10:03 AM
ఆస్ట్రియాలో ఓ మహిళ పారా గ్లైడింగ్ చేస్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ విమానం పారాచూట్ కానోపీని ఢీకొట్టింది. దీంతో కానోపీ ధ్వంసం అయింది. మహిళ దగ్గర ఎమర్జెన్సీ పారాచూట్ ఉండటంతో ప్రాణాలతో బయటపడింది.
ఇంటర్‌నెట్ డెస్క్: మహిళ పారా గ్లైడింగ్ చేస్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ విమానం పారాచూట్ కానోపీని ఢీకొట్టింది. దీంతో కానోపీ ధ్వంసం అయింది. మహిళ దగ్గర ఎమర్జెన్సీ పారాచూట్ ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన ఆస్ట్రియాలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మే 23వ తేదీన 44 ఏళ్ల సబ్రినా అనే మహిళ నార్త్ ఆస్ట్రియాలో పారా గ్లైడింగ్ చేస్తోంది. ఆమె ఆకాశంలో ఎంతో ఉత్సాహంగా విహరిస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.
ఓ విమానం వేగంగా ఆమె వైపు దూసుకువచ్చింది. పారాచూట్ కానోపీని ఢీకొట్టింది. అంతే.. కానోపీ పెద్ద శబ్దంతో ధ్వంసం అయింది. ఈ ఊహించని పరిణామంతో సెబ్రినా షాక్ అయింది. ఆమె గుండెలు ఝల్లుమన్నాయి. ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని రెండో పారాచూట్‌ను తెరిచింది. ఆ రెండో పారాచూట్ పూర్తిగా తెరుచుకోవడానికి చాలా సమయం పట్టింది. మొత్తానికి సెర్బియా సురక్షితంగా నేలపై ల్యాండ్ అయింది. అనుకోని ఈ సంఘటనతో ఆమెకు ఏడుపు ఆగలేదు. నేలపైకి వచ్చిన తర్వాత వెక్కి వెక్కి ఏడ్చింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సబ్రినా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ‘23.05.2026 నా రెండవ పుట్టినరోజు. నేను పారా గ్లైడింగ్ చేస్తున్నపుడు, సెస్నా 172 (Cessna 172) విమానం నన్ను ఆకాశం నుంచి కిందకు పడేసిన రోజు. నేను ఇక్కడ కూర్చుని ఈ విషయాన్ని టైప్ చేస్తున్నానంటే నిజంగా ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కొన్ని భయంకరమైన నల్లటి మచ్చలు, ఒళ్లంతా వాపులు తప్ప నాకు మరేమీ కాలేదు. నిజంగా ఏ ప్రమాదమూ జరగలేదు’ అని రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌తో ఒప్పందం విషయంలో తొందరపడడం లేదు: డొనాల్డ్ ట్రంప్
ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!