రూ.1.5 కోట్ల ఇల్లు కొన్నా.. ఇలా చేసుండాల్సింది కాదేమో.. టెకీ ఆవేదన
ABN , Publish Date - Jul 01 , 2026 | 10:01 PM
దాదాపు కోటిన్నర ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన ఒక టెకీ ప్రస్తుతం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. ఇటీవల కాలంలో ఒక్కసారిగా ఆదాయం పడిపోవడంతో తన జీతం ఈఎమ్ఐలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు కోటిన్నర ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన ఒక టెకీ ప్రస్తుతం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. ఇటీవల కాలంలో ఒక్కసారిగా ఆదాయం పడిపోవడంతో తన జీతం ఈఎమ్ఐలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంత ఖరీదు పెట్టి ఇల్లు కొనేముందు కాస్త ఆలోచించి ఉంటే బాగుండేదని అన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
‘ఏడాది క్రితం రూ.1.5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ కొన్నాను. 2024లో నా వార్షిక ఆదాయం రూ.24 లక్షలుగా ఉండేది. ఆ మరుసటి ఏడాది రూ.32 లక్షలకు చేరింది. దీంతో, అప్పట్లో నా నిర్ణయం సరైనదే అని అనిపించింది. కానీ గత రెండు త్రైమాసికాల్లో నా ఆదాయం బాగా పడిపోయింది. నా శాలరీ ఎక్కువగా ఇన్సెంటివ్ కమిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీంతో, ఆదాయంలో భారీ కోత పడింది’ అని చెప్పారు.
ఆర్థిక ఒత్తిడి పెరుగుతుండటంతో అదనపు ఆదాయం కోసం సైడ్ బిజినెస్ ఏదైనా ప్రారంభించే యోచనలో ఉన్నట్టు కూడా చెప్పారు. అసలు అంత ఖరీదు పెట్టి ఇల్లు కొనకుండా ఉండి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోందని అన్నారు. అత్యవసర నిధి కూడా రూ.5 లక్షలే ఉందని వాపోయారు. ఈ పోస్టుపై పెద్ద ఎత్తున స్పందించిన జనాలు ఆ ఇల్లు అమ్మేయాలని అన్నారు. నష్టానికి అమ్ముకున్నా ఫర్లేదని మరికొందరు చెప్పారు. చాలా మంది యువత ఇలాంటి తప్పే చేసి చిక్కుల్లో పడుతున్నారని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మా పేరు చెప్పగానే మైక్రోసాఫ్ట్‌లో 90 శాతం డిస్కౌంట్: శ్రీధర్ వెంబు
భారత్ విషయంలో ఎందుకు ఈ ఎగతాళి? పోలాండ్ మహిళ అసంతృప్తి