Share News

జాబ్ పోయింది.. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నా! టెకీ పోస్టు వైరల్

ABN , Publish Date - Apr 05 , 2026 | 07:19 PM

లేఆఫ్స్‌లో జాబ్ పోయినా తాను ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నానంటూ బెంగళూరుకు చెందిన ఓ టెకీ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

జాబ్ పోయింది.. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నా! టెకీ పోస్టు వైరల్
Bengaluru techie viral post

ఇంటర్నెట్ డెస్క్: జాబ్ పోయినా తన మనశ్శాంతిని మాత్రం కాపాడుకోగలిగానంటూ ఓ టెకీ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. భవిష్యత్తులో రాబోయే మార్పులను ముందే ఊహించి జాగ్రత్త పడటంతో ప్రస్తుతం జాబ్ పోయినా కనీసం ప్రశాంతత అయినా మిగిలిందని చెప్పుకొచ్చారు.

‘గతేడాది నేను బెంగళూరులో 3 బీహెచ్‌కే ఫ్లాట్ కొనేందుకు ప్రయత్నించాను. నాకు రూ.2 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనే స్తోమత ఉంది. కానీ అప్పటికే నేను ఏఐ టీమ్‌తో కలిసి పనిచేస్తుండేవాడిని. మరో 2-3 ఏళ్లల్లో ఏం జరగబోతోందో నాకు అప్పటికే అర్థమైంది. దీంతో, ఆఫీసుకు దగ్గరగా అద్దె ఇంట్లోనే ఉండేందుకు చివరకు నిర్ణయించుకున్నాను. గత వారం కంపెనీలో లే ఆఫ్స్‌లో భాగంగా నా ఉద్యోగం కూడా పోయింది. కానీ సంతోషం మాత్రం పీక్స్‌కు చేరింది. నాపై ఈఎమ్‌ఐల భారం పెద్దగా లేదు. ఇక ప్రశాంతంగా నేను ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తాను’ అని పోస్టు పెట్టారు.


బెంగళూరులో ఇ‌కుళ్ల ఉన్న డిమాండ్‌కు ఐటీ ఉద్యోగుల అవసరాలకు చాలా దగ్గర సంబంధం ఉందని కూడా ఆ టెకీ అభిప్రాయపడ్డారు. దాదాపు 70 శాతం వరకూ ఇళ్ల కొనుగోలుదారులు ఈ వర్గానికి చెందిన వారేనని అన్నారు. సర్వీస్ ఆధారిత బాధ్యతలు నిర్వహించే వారి ఉద్యోగాలు ఆటోమేషన్, ఏఐ కారణంగా రాబోయే రోజుల్లో ప్రమాదంలో పడతాయని అన్నారు. ఇక ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెకీ నిర్ణయం సబబేనని అనేక మంది అన్నారు.


ఈ వార్తలూ చదవండి:

దురంధర్-2.. దావూద్ ఇబ్రహీం, సల్మాన్ డకైత్‌ల గ్యాంగ్ వార్ చరిత్ర ఇదీ

ఆఫర్లున్నా కదలరు...ఉద్యోగం వదలరు!

Updated Date - Apr 06 , 2026 | 09:11 PM