Dog Grabs Stuffed Toy: కుక్క పట్టు అంటే ఇదేనేమో.. బొమ్మ ఇచ్చే వరకు వదల్లేదు..
ABN , Publish Date - Jan 01 , 2026 | 09:14 PM
ఓ కుక్క పట్టు వదలకుండా అనుకున్నది సాధించింది. ఓ షాపులోకి వెళ్లిన అది అక్కడి ఓ బొమ్మను పట్టుకుంది. ఆ బొమ్మను దాని కోసం కొని ఇచ్చే వరకు వదిలి పెట్టలేదు.
సాధారణంగా ఉడుము పట్టు, మొసలి పట్టు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీతో ఇకపై కుక్క పట్టు అని కూడా అనక తప్పదు. ఎందుకంటే ఓ కుక్క పట్టు వదలకుండా అనుకున్నది సాధించింది. ఓ షాపులోకి వెళ్లిన అది అక్కడి ఓ బొమ్మను పట్టుకుంది. ఆ బొమ్మను దాని కోసం కొని ఇచ్చే వరకు వదిలి పెట్టలేదు. ఈ సంఘటన మెక్సికో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం ఓ వీధి కుక్క ఓ షాపింగ్ మాల్‌లోకి వెళ్లింది. ఆ షాపింగ్ మాల్‌లో ఓ చోట అమ్మటం కోసమని చిన్న చిన్న బొమ్మలు పెట్టి ఉంచారు.
వాటిని చూడగానే కుక్కకు బాగా నచ్చాయి. పరిగెత్తుకుంటూ వెళ్లి ఓ బొమ్మను పట్టుకుంది. ఇది గమనించిన షాపు వాళ్లు వీధి కుక్కను తరిమి బొమ్మను లాక్కునే ప్రయత్నం చేశారు. అది భయపడలేదు సరికదా.. బొమ్మను పట్టువిడవకుండా గట్టిగా పట్టుకుంది. ఆ షాపులో పని చేసే ఓ అమ్మాయి ఎంత ప్రయత్నించినా కుక్క నోటి నుంచి బొమ్మను బయటకు తీయటం ఆమె వల్ల కాలేదు. ఇక, ఈ దృశ్యాలను చూసి అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. వారిలో కొంతమంది చందాలు వేసుకుని ఆ బొమ్మను కుక్కకు కొనిచ్చారు.
ఆ కుక్క బొమ్మను తీసుకుని ఎంతో సంతోషించింది. అటు, ఇటు గెంతులు వేస్తూ ఆ బొమ్మతో ఆడుకోవటం మొదలెట్టింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆ వీడియో వీధి కుక్క జీవితాన్ని మార్చేసింది. అల్లన్ అనే జంతు ప్రేమికుడు ఆ వీడియో చూశాడు. ఆ కుక్క అతడికి బాగా నచ్చింది. వెంటనే షాపింగ్ మాల్ దగ్గరకు వెళ్లాడు. ఆ వీధి కుక్కను ఇంటికి తెచ్చుసుకుని పెంచుకుంటున్నాడు. ‘ఆ కుక్క కొంచెం అల్లరిదే కానీ.. చాలా ప్రేమ కలది’ అని అల్లన్ అంటున్నాడు.
ఇవి కూడా చదవండి
మీ ట్యాలెంట్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి
బట్టల షాపులో యువకుడి దారుణం.. యువతి గొంతు మీద కత్తి పెట్టి..