షాకింగ్.. పాములు ఇలా కూడా చేస్తాయా.. ఓ పాము తనను తానే ఎలా మింగేస్తోందో చూడండి..
ABN , Publish Date - Feb 15 , 2026 | 04:09 PM
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. పాములు మిగతా జంతువులతో పోలిస్తే కొన్ని విచిత్రమైన లక్షణాలను కలిగి ఉంటాయి.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. పాములు మిగతా జంతువులతో పోలిస్తే కొన్ని విచిత్రమైన లక్షణాలను కలిగి ఉంటాయి. పాములకు ఆకలి వేస్తే తమ పిల్లలనే తినేస్తాయని చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఓ పాముకు సబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక పాము తనను తానే మింగేస్తోంది (snake swallows own tail).
@TheeDarkCircle అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక పాము కనబడుతోంది. ఆ వీడియోలో ఒక పాము తన తోక భాగాన్ని తానే మింగేస్తోంది. తోక నుంచి మొదలు పెట్టి శరీరా భాగాన్ని నోటితో మింగేస్తోంది. బాగా ఒత్తిడికి గురైనపుడు, బాగా వేడి ప్రదేశంలో ఉన్నప్పుడు, నాడీ వ్యవస్థలో లోపం తలెత్తినపుడు పాములు ఇలా ప్రవర్తిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు (rare snake behavior).
ఆ షాకింగ్ వీడియోను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (shocking wildlife video). ఈ వీడియోను కొన్ని వేల మంది వీక్షించారు. కొన్ని వందల మంది ఆ వీడియను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. పాములు ఇతర జీవులకే కాదని, తమకు తాము కూడా హాని కలగజేసుకుంటాయని ఒకరు కామెంట్ చేశారు. పాములు ఇలా చేయడానికి అధిక ఒత్తిడే కారణమని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పైలెట్, కో-పైలెట్‌కు ఒకే ఆహారాన్ని ఎందుకివ్వరు.. ఆసక్తికర కారణం తెలిస్తే..
మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ నాలుగింటిలో భిన్నమైన చేపను 5 సెకెన్లలో గుర్తించండి..