Share News

Cow vs Leopard: వామ్మో.. ఆవుకు అంత పవర్ ఉందా.. చిరుతతో ఎలా పోరాడిందో చూడండి..

ABN , Publish Date - Jan 13 , 2026 | 10:34 AM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఆవు, చిరుత పోరాటానికి సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Cow vs Leopard: వామ్మో.. ఆవుకు అంత పవర్ ఉందా.. చిరుతతో ఎలా పోరాడిందో చూడండి..
cow leopard face off

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఆవు, చిరుత పోరాటానికి సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (cow fighting leopard).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక ఆవును చిరుత పట్టుకుంది (viral wildlife video). ఆవు గొంతు పట్టుకుని దానిని చంపడానికి ప్రయత్నించింది. అయితే ఆ ఆవు మాత్రం గట్టిగా ప్రతిఘటించింది. చిరుత తన గొంతు పట్టుకున్నా పట్టు వదలకుండా దానిని ఈడ్చుకుంటూ ముందుకు సాగింది. చిరుత ఎంతగా ప్రయత్నించినా ఆవు మాత్రం తన పోరాటం ఆపలేదు. చివరకు చిరుత ఆ ఆవును వదిలేసి పారిపోయింది. అక్కడున్న వారు ఆ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. ఏడాదిలో లక్ష వీసాలు రద్దు..

Updated Date - Jan 13 , 2026 | 11:29 AM