మందు బాబుల వీరంగం.. మద్యం ఇవ్వలేదని 18 బాటిళ్లతో దాడి..
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:19 AM
ఏప్రిల్ 16న అర్ధరాత్రి నాగ్‌పూర్‌లోని ఎస్కే బార్‌లో మద్యం తాగేందుకు కొంతమంది యువకులు వచ్చారు. బార్ మూసే సమయం కావడంతో మేనేజర్, సిబ్బంది ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే..
నాగ్‌పూర్: మద్యం ఇవ్వలేదనే కారణంతో బార్ సిబ్బందిపై కొందరు యువకులు చేసిన భయానక దాడి వైరల్‌గా మారింది. బార్ మేనేజర్, సిబ్బందిపై మద్యం బాటిళ్లతో దాడి చేసి రక్తమెుచ్చేలా కొట్టారు మందు బాబులు. అర్ధరాత్రి వేళ బార్‌లో హంగామా సృష్టించారు. ఈ దాడిలో మేనేజర్‌కు తీవ్రగాయాలు కాగా.. మరో వ్యక్తికి స్వల్పగాయాలు అయ్యాయి. నాగ్‌పూర్‌లోని మానేవాడ చౌక్‌లో ఉన్న ఎస్కే బార్‌లో ఈ ఘటన జరిగింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఏప్రిల్ 16న అర్ధరాత్రి నాగ్‌పూర్‌లోని ఎస్కే బార్‌లో మద్యం తాగేందుకు కొంతమంది యువకులు వచ్చారు. బార్ మూసే సమయం కావడంతో మేనేజర్, సిబ్బంది ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, తమకు మద్యం కావాలని సదరు యువకులు బార్ సిబ్బందిని అడిగారు. సమయం ముగిసిందని చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యారు. అందులోని కొంతమంది యువకులు బయట నుంచి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చి వాగ్వాదానికి దిగారు. అనంతరం మేనేజర్, సిబ్బందిపై దాడి చేశారు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే మిగతా యువకులంతా లోపలికి వచ్చి భయానక వాతావరణం సృష్టించారు. సిబ్బందిపై చేతులతో పిడిగుద్దులు కురిపించారు. కాళ్లతో తన్నారు. ఇష్టమెుచ్చినట్లు చావ కొట్టారు.
నిమిషం వ్యవధిలోనే 18 బాటిళ్లతో దాడి చేయడంతో మేనేజర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. తల, ముఖం, ఇతర భాగాలపై గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. బట్టలు మెుత్తం చింపేశారు. బాధితుడికి తీవ్ర రక్తస్రావం అవుతున్నా వదిలిపెట్టకుండా రణరంగం సృష్టించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దాడిలో దాదాపు 10 మందికి పైగా మందు బాబులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడి దృశ్యాలు చూసిన నెటిజన్లు యువకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బైకుతో ట్రైన్‌ను లాగాలని చూసిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే..
అభిమాని అత్యుత్సాహం.. భయపడిపోయిన మమతా బెనర్జీ..