భారత్‌పై సంచలన వీడియో.. నటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
ABN , Publish Date - May 29 , 2026 | 10:53 AM
ప్రముఖ బాలీవుడ్ నటి షెహనాజ్ ట్రెజరీ భారత్‌పై సంచలన కామెంట్లు చేశారు. భారత్ శుభ్రత లేని దేశమని అన్నారు. పొరుగు దేశం శ్రీలంకపై ఆమె ప్రశంసల జల్లులు కురిపించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి షెహనాజ్ ట్రెజరీ భారత్‌పై సంచలన కామెంట్లు చేశారు. భారత్ శుభ్రత లేని దేశమని అన్నారు. పొరుగు దేశం శ్రీలంకపై ఆమె ప్రశంసల జల్లులు కురిపించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. షెహనాజ్ ట్రెజరీ శ్రీలంకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లా రైల్వేకు ఆమె వెళ్లారు. రైల్వే స్టేషన్‌లో పరిశుభ్రత, అక్కడ భారీ సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. రైల్వే స్టేషన్ పరిశుభ్రతపై ఆమె ఓ వీడియో చిత్రీకరించారు. భారత్‌లో పరిశుభ్రత గురించి ప్రస్తావించారు.
ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడారంటే.. ‘నేను శ్రీలంకలోని రైల్వే స్టేషన్‌లో ఉన్నాను. ఇక్కడ ఎంత మంది విదేశీ టూరిస్టులు ఉన్నారో ఒక్కసారి చూడండి. శ్రీలంక మన పక్కనే ఉంది. కానీ, మనకంటే ఎక్కువ మంది టూరిస్టులు ఎందుకు శ్రీలంకకు వస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే శ్రీలంక చాలా శుభ్రంగా ఉంటుంది. ఓ సారి డస్ట్ బిన్స్ చూడండి. ఇవి రైల్వే స్టేషన్‌లోనే ఉన్నాయి. శుభ్రత లేని కారణంగానే ఇండియా టూరిస్టులను కోల్పోతోంది. మనది అస్సలు శుభ్రత లేని దేశం’ అని అన్నారు.
ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే.. మరి కొంతమంది విమర్శిస్తున్నారు. ‘మేడమ్ మీరు చెప్పింది నిజమే. దేశంలో శుభ్రత లేదు. పురాతన కట్టడాలను కాపాడుకోవటం అస్సలు తెలీదు’..‘ఇండియా ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం. జనాభా ఎక్కువ ఉంటే శుభ్రత విషయంలో ఇబ్బంది తప్పదు’..‘స్కూలు నుంచే పిల్లలకు శుభ్రత గురించి నేర్పించాలి’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సోనియా, రాహుల్ గాంధీలతో సిద్దరామయ్య భేటీ..
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..