అవకాశాల కోసం క్యాన్సర్‌ను దాచి.. ప్రముఖ నటి కష్టాలు..
ABN , Publish Date - Jul 26 , 2026 | 03:49 PM
ప్రముఖ బాలీవుడ్ నటి షగుఫ్త అలీ తన జీవితంలో చోటుచేసుకున్న దారుణమైన పరిస్థితుల గురించి తాజాగా బయటపెట్టారు. క్యాన్సర్ స్టేజ్ 3లో ఉన్నా.. అవకాశాల కోసం ఎవరికీ తెలియకుండా దాచాల్సి వచ్చిందని చెప్పారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి షగుఫ్త అలీ తన జీవితంలో చోటుచేసుకున్న దారుణమైన పరిస్థితుల గురించి తాజాగా బయటపెట్టారు. క్యాన్సర్ స్టేజ్ 3లో ఉన్నా.. అవకాశాల కోసం ఎవరికీ తెలియకుండా దాచాల్సి వచ్చిందని చెప్పారు. షగుఫ్త తాజాగా సిద్ధార్ధ్ కన్నన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌తో బాధపడ్డ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ..
‘ఆ రోజుల్లో కొన్ని విషయాల గురించి(క్యాన్సర్ గురించి..) అస్సలు బయట చెప్పకూడదని జనాలు భావించే వారు. దాని గురించి మాట్లాడవద్దని, ప్రస్తావన కూడా తేవద్దని అనేవారు. అలా చేస్తే అవకాశాలు రావనేవారు. నాకు క్యాన్సర్ ఉందన్న సంగతి బయటకు తెలిస్తే అవకాశాలు రావని, జనాలు నన్ను వింతగా చూస్తారని, నాతో వింతగా ప్రవర్తిస్తారని భయపడ్డాను. అందుకే క్యాన్సర్ గురించి బయటకు చెప్పలేదు. ఆ సమయంలో ఆర్థికంగా నేను చాలా కష్టాలు పడ్డాను. దాచుకున్న డబ్బంతా క్యాన్సర్ చికిత్స కోసం అయిపోయింది’..
‘చికిత్స కోసం.. రోజూవారి అవసరాల కోసం నా నగలు, కారు అమ్మాల్సి వచ్చింది. 2017 నుంచి ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యాయి. నా పరిస్థితి చూసి జనం నన్ను ప్రశ్నించటం మొదలెట్టారు. డబ్బులు దాచుకోలేదా అని చాలా మంది అడిగారు. నేను డబ్బు దాచుకున్నాను. కానీ.. చికిత్స కోసం, ఇంటి ఖర్చులకు ఆ డబ్బులు అయిపోయాయి. నటుల దగ్గర బోలెడంత డబ్బులు ఉంటాయని జనం అనుకోకూడదు. నేను ఎప్పుడూ విలాసాల కోసం డబ్బులు ఖర్చు చేయలేదు. మందుల కోసం, ఇంటి ఖర్చుల కోసం డబ్బులను ఖర్చుపెట్టాను’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్
ఆటో రైట్ టర్న్.. ఎదురుగా దూసుకొచ్చిన బస్సు.. తర్వాత ఏం జరిగిందంటే ?