Share News

అమెరికా మంత్రి సాహసం.. ఒట్టి చేతులతో రెండు పాములను పట్టుకుని..

ABN , Publish Date - May 27 , 2026 | 03:50 PM

సముద్ర తీరంలో అమెరికా మంత్రి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ రెండు నల్ల రేసర్ పాములను ఒంటిచేత్తో పట్టుకున్న ఒక ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

అమెరికా మంత్రి సాహసం.. ఒట్టి చేతులతో రెండు పాములను పట్టుకుని..
Robert F Kennedy Jr viral video

ఇంటర్నెట్ డెస్క్: సముద్ర తీరంలో అమెరికా మంత్రి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ రెండు నల్ల రేసర్ పాములను ఒంటిచేత్తో పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కెన్నెడీ స్వయంగా తన 'X' (ట్విట్టర్) ఖాతాలో ఈ క్లిప్‌ను పంచుకున్నారు. అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి అయిన ఆయన.. ఎలాంటి భయం లేకుండా రెండు నల్ల రేసర్ (Black Racer) పాములను ఎంతో నింపాదిగా పైకి ఎత్తడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే, ఆయన పక్కనే ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆ పాములను గాలిలోకి లేపి చుట్టూ ఉన్నవారికి చూపిస్తున్నాడు. ఆ సమయంలో పాములు ఆయన పట్టు నుంచి తప్పించుకోవడానికి పదేపదే మెలికలు తిరుగుతూ కనిపించాయి.


ఈ వైరల్ వీడియోలో ప్రముఖ సెలబ్రిటీ డాక్టర్ మెహమెట్ ఓజ్, ఆయన భార్య కూడా ఉన్నారు. కెన్నెడీ భార్య, ప్రముఖ నటి చెరిల్ హైన్స్ తన భర్త చేస్తున్న సాహసాన్ని చూసి తీవ్రంగా భయపడిపోయారు. ఆయనను జాగ్రత్తగా ఉండమని పదేపదే హెచ్చరించారు. ‘అవి చాలా ప్రమాదకరం. బన్నీ.. ప్లీజ్, వాటిని వదిలేసేయ్!’ అని హైన్స్ ఆందోళనగా అరవడం ఆ క్లిప్‌లో స్పష్టంగా వినిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కెన్నెడీ ధైర్యాన్ని కొందరు మెచ్చుకుంటుంటే, అంతటి ప్రమాదకరమైన పాములతో అజాగ్రత్తగా వ్యవహరించడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2026: ఆర్సీబీ ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ పాటీదార్ ఏమన్నాడంటే?

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

Updated Date - May 27 , 2026 | 04:36 PM