Share News

గ్వాలియర్ ఐజీకి ఘన వీడ్కోలు.. పళ్లతో కారు లాగిన కానిస్టేబుల్..

ABN , Publish Date - Aug 01 , 2026 | 05:33 PM

రిటైర్‌మెంట్ రోజున మధ్య ప్రదేశ్‌కు చెందిన గ్వాలియర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఆఫ్ పోలీస్ అరవింద్ సక్సేనాకు ఘన వీడ్కోలు లభించింది. పోలీస్ కానిస్టేబుల్ సునీల్.. ఐజీపై ఉన్న గౌరవాన్ని తనదైన శైలిలో చాటుకున్నాడు. ఐజీ కారును తన పళ్లతో 50 మీటర్లు లాగాడు.

గ్వాలియర్ ఐజీకి ఘన వీడ్కోలు.. పళ్లతో కారు లాగిన కానిస్టేబుల్..
Arvind Saxena

ఇంటర్‌నెట్ డెస్క్: రిటైర్‌మెంట్ రోజున మధ్య ప్రదేశ్‌కు చెందిన గ్వాలియర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఆఫ్ పోలీస్ అరవింద్ సక్సేనాకు ఘన వీడ్కోలు లభించింది. వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా బాహుబలిగా పేరు గాంచిన పోలీస్ కానిస్టేబుల్ సునీల్.. ఐజీపై ఉన్న గౌరవాన్ని తనదైన శైలిలో చాటుకున్నాడు. ఐజీ కారును తన పళ్లతో 50 మీటర్లు లాగాడు. శుక్రవారం వీడ్కోలు కార్యక్రమం ముగిసిన తర్వాత ఐజీ తన కారులో అక్కడినుంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. కానిస్టేబుల్ సునీల్.. ఐజీని, ఇతర అధికారులను ఒప్పించి తాడు సాయంతో కారును లాగడానికి పూనుకున్నాడు.


కారుకు కట్టిన తాడును పళ్లతో పట్టుకుని చేతుల సాయంతో వీడ్కోలు కార్యక్రమం జరిగిన భవనం దగ్గరినుంచి రోడ్డు మీదకు లాక్కెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నిజంగా బాహుబలిలానే కారును చాలా ఈజీగా లాగాడు’..‘కానిస్టేబుల్ సునీల్ శక్తి అసాధారణమైనది’..‘సునీల్ బాహుబలి సోషల్ మీడియాలో చాలా ఫేమస్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

నాయకత్వం నుంచి ప్రేమ వరకు.. ఆగస్టులో పుట్టిన వారి ప్రత్యేక లక్షణాలు ఇవే!

పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ నోట అదే మాట

Updated Date - Aug 01 , 2026 | 05:43 PM