ధురంధర్ నటుడిపై బ్యాన్.. FWICE నిర్ణయం లీగలేనా?..
ABN , Publish Date - May 26 , 2026 | 02:00 PM
ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తీసుకున్న బ్యాన్ నిర్ణయం బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ సహాయ నిరాకరణపై ఇప్పటి వరకు రణ్‌వీర్ సింగ్ స్పందించలేదు. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ నిర్ణయాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
ముంబై, మే 26: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ( FWICE )’ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇకపై రణ్‌వీర్ సినిమాలకు ఎలాంటి సాయం అందించబోమని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ స్పష్టం చేసింది. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తీసుకున్న ఈ నిర్ణయం బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ సహాయ నిరాకరణపై ఇప్పటి వరకు రణ్‌వీర్ సింగ్ స్పందించలేదు. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ నిర్ణయాన్ని రణ్‌వీర్ కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
FWICE నిర్ణయం లీగలేనా?..
న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం విధించటం లీగల్ కాదు. ఈ నిషేధం ట్రేడ్ యూనియన్ తీసుకున్న చర్యల కిందకి వస్తుంది. పని చేసే తన హక్కును అన్యాయంగా కాలరాస్తున్నారని రణ్‌వీర్ భావించినపుడు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ నిర్ణయాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. న్యాయపరమైన హద్దులు దాటి ఇండస్ట్రీ బాయ్‌కాట్‌లు జరిగినపుడు కోర్టులు కలుగజేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే..
రణ్‌వీర్ హీరోగా.. పర్హాన్ అక్తర్ డైరక్షన్‌లో రెండేళ్ల క్రితం ‘డాన్ 3’ సినిమా మొదలైంది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తయిన తర్వాత రణ్‌వీర్ సినిమా నుంచి తప్పుకున్నారు. రణ్‌వీర్ కారణంగా ఆర్థికంగా తాము చాలా నష్టపోయామంటూ పర్హాన్ అక్తర్ ఎఫ్‌డబ్ల్యూఐసీఈకి ఫిర్యాదు చేశారు. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు అశోకే పండిత్ విచారణ మొదలుపెట్టారు. రణ్‌వీర్‌ను సంప్రదించగా.. అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కొన్ని నెలల తర్వాత రణ్‌వీర్ ఎఫ్‌డబ్ల్యూఐసీఈకి ఓ మెయిల్ పంపాడు. ఆ మెయిల్‌లో .. ‘ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చట్టపరిధిలోకి రాదు. ఈ వివాదంలో కలుగుజేసుకునే అధికారం కూడా ఎఫ్‌డబ్ల్యూఐసీఈకి లేదు’ అని తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ రణ్‌వీర్‌పై నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి
ఆర్జీయూకేటీ పగ్గాలు గవర్నర్‌కు?
ఘనంగా 'అప్నాపన్: మై ఎక్స్‌పీరియన్స్ విత్ నరేంద్ర మోదీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం..