Share News

కోతి చేతిలో పర్సు.. గాల్లోకి కరెన్సీ నోట్లు.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 05 , 2026 | 09:59 AM

రాజస్థాన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో కోతి చేసిన విచిత్ర చేష్టలు ప్రయాణికులను నవ్వులతో పాటు షాక్‌కు గురిచేశాయి. మహిళా ప్రయాణికురాలి పర్సును ఎత్తుకెళ్లిన కోతి.. అందులోని కరెన్సీ నోట్లను ఒక్కొక్కటిగా కిందకు విసరడంతో ప్లాట్‌ఫామ్‌పై ఒక్కసారిగా డబ్బుల వేట మొదలైంది..

కోతి చేతిలో పర్సు.. గాల్లోకి కరెన్సీ నోట్లు.. వీడియో వైరల్
Monkey Viral Video

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో ఉన్న శ్రీ మహావీర్ జీ రైల్వే స్టేషన్‌లో ఓ కోతి చేసిన హంగామా ప్రయాణికులను ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. రైలు దిగిన ఓ మహిళా ప్రయాణికురాలి పర్సును కోతి లాక్కొని నేరుగా రైల్వే స్టేషన్‌ షెడ్డుపైకి ఎక్కింది. కింద ఉన్న ప్రయాణికులు పండ్లు.. ఆహార పదార్థాలు చూపిస్తూ పర్సును తిరిగి ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ కోతి మాత్రం పట్టించుకోలేదు. పైగా పర్సును తెరిచి అందులో ఉన్న డబ్బును బయటకు తీసి ఒక్కొక్కటిగా కిందకు విసరడం ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పై కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడటంతో అక్కడున్న ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. డబ్బు కింద పడుతుండటంతో వాటిని ఏరుకునేందుకు కొందరు పరుగులు తీయడంతో కొద్దిసేపు అక్కడ తొక్కిసలాట పరిస్థితి కనిపించింది.


కోతి చేస్తున్న ఈ వింత చేష్టలను చూసిన పలువురు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించడం ప్రారంభించారు. ఇదే సమయంలో కొంతమంది యువకులు షెడ్డుపైకి.. గోడలపైకి ఎక్కి కింద పడుతున్న నోట్లను సేకరించి మహిళా ప్రయాణికురాలికి అందించేందుకు ప్రయత్నించారు. కోతి మాత్రం ఏమాత్రం బెదరకుండా పర్సులోని నోట్లను తీసి గాల్లోకి విసురుతూ తనదైన శైలిలో హంగామా చేసింది. చివరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - Sep 05 , 2026 | 11:43 AM