మురికి కాల్వలో స్నానం.. ఆహారాన్ని మురికి నీళ్లలో ముంచి..
ABN , Publish Date - May 01 , 2026 | 07:02 AM
ఓ సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ రీల్ కోసం దారుణమైన పని చేశాడు. మురికి నీళ్లలో స్నానం చేయటమే కాకుండా.. అందులో ఆహారాన్ని ముంచి మరీ తిన్నాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: సోషల్ మీడియాలో పాపులారిటీ, వ్యూస్ కోసం కొంతమంది జుగుప్సాకరమైన పనులు చేస్తున్నారు. తాజాగా, ఓ సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ రీల్ కోసం దారుణమైన పని చేశాడు. మురికి నీళ్లలో స్నానం చేయటమే కాకుండా.. అందులో ఆహారాన్ని ముంచి మరీ తిన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. పునీత్ సూపర్ స్టార్ అనే వ్యక్తికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడు మురికి నీళ్ల దగ్గర వీడియోలు చేస్తూ చాలా ఫేమస్ అయ్యాడు. తాజాగా, అతడు ఓ మురికి కాలువ దగ్గర వీడియో చేశాడు.
మొదట మురికి కాలువలో స్నానం చేశాడు. తర్వాత మురికి కాలువ గట్టుపై ఉన్న చోలే, ఆలూ కుల్చే (ఇదొక నార్త్ ఇండియన్ ఆహారం)లను తిన్నాడు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. బిస్కట్‌ను టీలో ముంచుకుని తిన్నట్లు.. ఆలూ కుల్చేలను మురికి నీళ్లలో ముంచి తిన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వ్యూస్ కొంత మరీ ఇంతలా దిగజారాలా? ప్రాణాలను రిస్క్‌లో పెట్టాలా?’..‘ఈ వీడియో చూస్తుంటే వాంతికి వస్తోంది. అతనెలా మురికి నీళ్లలో దాన్ని ముంచుకుని తిన్నాడో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు