మీ చట్టాలను మార్చండి
ABN , Publish Date - May 01 , 2026 | 06:40 AM
బాధిత బాలికను గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. 20 వారాలు దాటిన తర్వా త కూడా అవాంఛిత గర్భాన్ని...
అత్యాచార బాధితురాలి గర్భవిచ్ఛిత్తికి ఉన్న కాలపరిమితిని తొలగించండి
‘15 ఏళ్ల బాలిక 7 నెలల గర్భవిచ్ఛిత్తి’ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: బాధిత బాలికను గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. 20 వారాలు దాటిన తర్వా త కూడా అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అత్యాచార బాధితులకు అనుమతినిచ్చేలా చట్టాన్ని సవరించాలని కేంద్రానికి సూచించింది. 15ఏళ్ల బాలిక 7 నెలల గర్భవిచ్ఛిత్తికి అనుమతినిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా.. వాటిని రద్దు చేయాలంటూ ఎయిమ్స్ క్యూరెటివ్ పిటిషన్ వేసింది. ఈ దశలో అబార్షన్ చేస్తే బాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిల ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘అత్యాచారం కారణంగా గర్భం దాల్చినప్పుడు గర్భవిచ్ఛిత్తికి కాలపరిమితి లే కుండా మీ చట్టాన్ని సవరించండి. చట్టం సహజంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండాలి. అటువంటి విచారణలు వారంలోపే పూర్తయ్యేలా ఉండా లి. విచారణ ముగిసేవరకు ఆ బిడ్డ ఎందుకు వేదనను భరించాలి?’ అని కేంద్రాన్ని ఉద్దేశించి సీజేఐ ప్రశ్నించారు. ఎయిమ్స్ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. ‘ఈ దశలో బాలికకు గర్భవిచ్ఛిత్తి సాధ్యం కాదు.. ఒకవేళ చేస్తే ఆమెకు జీవితాంతం ఆరోగ్య సమస్యలు వస్తాయి’ అని వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘గర్భవిచ్ఛిత్తికి అనుమతించకపోతే అది ఆమె జీవితానికే మచ్చ అవుతుంది. ఆమె చదువుకోవాల్సిన వయసులో ఓ బిడ్డకు తల్లిని చేస్తే ఎలా..?’ అని ప్రశ్నించింది. ఏదేమైనా గర్భాన్ని కొనసాగించాలా.. వద్దా..? అనేది నిర్ణయించుకోవాల్సింది సదరు బాలికేనని స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!
పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..