గుడ్డు లోపలి నుంచి ప్లాస్టిక్.. విక్రయించిన కంపెనీ ఏం చెప్పిందంటే..
ABN , Publish Date - Feb 25 , 2026 | 08:13 PM
సాధారణంగా గుడ్లు చాలా ఆరోగ్యకరమైనవని భావిస్తుంటాం. ప్రతిరోజు గుడ్డు తినే వారు ఎంతో మంది ఉంటారు. అయితే గుడ్లకు సంబంధించిన ఓ షాకింగ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జెప్టో నుంచి ఆర్డర్ చేసిన గుడ్లను ఉడికించిన ఓ మహిళకు దిమ్మదిరిగే అనుభవం ఎదురైంది.
సాధారణంగా గుడ్లు చాలా ఆరోగ్యకరమైనవని భావిస్తుంటాం. ప్రతిరోజు గుడ్డు తినే వారు ఎంతో మంది ఉంటారు. అయితే గుడ్లకు సంబంధించిన ఓ షాకింగ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జెప్టో నుంచి ఆర్డర్ చేసిన గుడ్లను ఉడికించిన ఓ మహిళకు దిమ్మదిరిగే అనుభవం ఎదురైంది. దానిని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె జెప్టో నుంచి ఎగ్గోజ్ ఎవ్రీడే బ్రాండ్ గుడ్లను ఆర్డర్ చేసింది. వాటిని ఉడకబెడుతున్న సమయంలో గుడ్డు నుంచి పచ్చసొనకు బదులుగా, ప్లాస్టిక్ బయటకు రావడం కనిపించింది (Plastic layer in egg).
'మార్కెట్లో నకిలీ లేదా ప్లాస్టిక్ గుడ్లు అమ్ముడవుతున్నాయని గతంలో విన్నాను. కానీ ఈ రోజు నేను నా కళ్లతో ఆ అనుభవాన్ని చూశాను. గుడ్డు నుంచి నూడుల్స్ రూపంలో ప్లాస్టిక్ బయటకు వస్తున్నట్టు వీడియోలో చూడవచ్చు. ప్రతి గుడ్డుపై ఎగ్గోజ్ ఎవ్రీడే స్టాంప్ ఉంది. ప్లాస్టిక్ నకిలీ గుడ్లు మన ఇళ్లకు ఎలా చేరుతున్నాయో చూడండి' అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఎగ్గోజ్ సంస్థ స్పందించింది (Zepto viral complaint).
'మీకు ఎదురైన అనుభవం విని మేము నిజంగా చింతిస్తున్నాము. మీ ఆందోళనను పూర్తిగా అర్థం చేసుకున్నాము. మా కస్టమర్‌లు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాలని మేము ఎప్పుడూ కోరుకోము. దయచేసి మీ సమాచారాన్ని మాకు పంపించండి. మా కస్టమర్ సపోర్ట్ బృందం దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి మీతో కనెక్ట్ అవుతుంది. ఈ విషయాన్ని మా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు' అని కంపెనీ పేర్కొంది (Eggoz egg controversy).
ప్లాస్టిక్ లేదా కృత్రిమ గుడ్లు అనేది ఒక అపోహ మాత్రమేనని, సహజమైన గుడ్డును పోలిన ప్లాస్టిక్ లేదా కృత్రిమ గుడ్డును ఉత్పత్తి చేయగల సాంకేతికత ఏదీ లేదని ఎగ్గోజ్ స్పష్టం చేసింది (Egg quality clarification). గుడ్లను వివిధ దశలలో నిల్వ ఉంచడం లేదా ఉష్ణోగ్రత పరిస్థితుల కారణంగా ఆకృతి లేదా రూపంలో వైవిధ్యాలు సంభవించవచ్చని, ఇటువంటి సహజ మార్పులు ఆహార భద్రతను ప్రభావితం చేయవని ఎగ్గోజ్ స్పష్టం చేసింది. ఏదమైనా ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడతామని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో HOT పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..
ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు.. అందరూ చూస్తుండగా ఏం చేశాడంటే..