Share News

పాత ఇంటి గోడలో మట్టి కుండ.. పగలగొట్టి చూడగా దిమ్మ తిరిగే సీన్..

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:21 AM

పాత ఇంటి గోడను కూల్చుతుండగా బయటపడిన పురాతన మట్టి కుండను చూసి కూలీలు ఆశ్చర్యపోయారు. అందులో బంగారం, వెండి లేదా నాణేలు ఉంటాయని భావించి ఎంతో జాగ్రత్తగా బయటకు తీశారు. కుండ తెరిచి చూసి ఒక్కసారిగా నివ్వెరపోయారు.

పాత ఇంటి గోడలో మట్టి కుండ.. పగలగొట్టి చూడగా దిమ్మ తిరిగే సీన్..
Instagram Viral Video

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. తాజాగా ఓ పాత ఇంటిని కూల్చివేస్తుండగా చోటుచేసుకున్న ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇంటి గోడను కూల్చుతున్న సమయంలో గోడ లోపల ఓ పురాతన మట్టి కుండ బయటపడటంతో కూలీలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కుండను చూసిన వారంతా అందులో బంగారం, వెండి లేదా విలువైన పురాతన నాణేలు ఉండొచ్చని భావించారు. దీంతో కుండను ఎంతో జాగ్రత్తగా బయటికి తీశారు. దాని ఆకారం, పాత రూపాన్ని చూసి అక్కడున్న వారిలో ఉత్కంఠ మరింత పెరిగింది. ఏళ్లనాటి రహస్య నిధి బయటపడిందని భావించిన వారంతా కుండలో ఏముందోనని ఆసక్తిగా ఎదురుచూశారు.


కుండ తెరిచి చూస్తే అసలు ట్విస్ట్!

కుండను బయటకు తీసి పరిశీలించడంతో అందరి ఆశలు అడియాశలయ్యాయి. అందులో బంగారం, వెండి, పురాతన నాణేలు వంటి విలువైన వస్తువులేవీ కనిపించలేదు. కేవలం ఎండు మట్టి, చిన్న చిన్న గులకరాళ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నిధి దొరుకుతుందని ఆశించిన వారి ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. పూర్వకాలంలో ఇళ్ల నిర్మాణ సమయంలో కొన్ని సంప్రదాయాలు, నమ్మకాల ప్రకారం గోడలు లేదా పునాదుల్లో కుండలను ఉంచే ఆచారం ఉండేదని, అలాగే ధాన్యం లేదా ఇతర వస్తువులను భద్రపరచడానికి కూడా వాటిని ఉపయోగించేవారని చెబుతుంటారు.

ఈ వీడియో 'shubhaam_gaur' అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘'ఈరోజు కూలీ కోటీశ్వరుడు అవుతాడనుకున్నా' అని, ‘పాత కుండల్లో నిధులు దొరకడం సినిమాల్లోనే సాధ్యం’ అని ఒకరు, ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. భలే బోల్తాపడ్డారు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర

బీఆర్‌ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 04 , 2026 | 12:06 PM