నేపాల్‌లో వరదల బీభత్సం.. సెకన్లలో మాయమైన ఊర్లు.. వీడియోల్లో భయానక దృశ్యాలు..
ABN , Publish Date - Aug 27 , 2026 | 02:41 PM
నేపాల్‌లో వరదలు కనీవినీ ఎరుగని రీతిలో బీభత్సాన్ని సృష్టించాయి. ఉద్ధృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లోని చాలా ఊళ్లను తుడిచిపెట్టేసింది. వందల మంది వరదల్లో గల్లంతయ్యారు.
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్‌లో వరదలు కనీవినీ ఎరుగని రీతిలో బీభత్సాన్ని సృష్టించాయి. ఉద్ధృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లోని చాలా ఊళ్లను తుడిచిపెట్టేసింది. వందల మంది వరదల్లో గల్లంతయ్యారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు 160 ప్రాణాలు కోల్పోయారు. ఇక, వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని వీడియోలలో వరదల తీవ్రతను కళ్లకు కట్టే భయానక దృశ్యాలు ఉన్నాయి.
ప్రకాశ్ కున్వర్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో వరద నీటిలో ఊరు మొత్తం కొట్టుకుపోయింది. జనం వరద నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుందామని ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. అందరూ నీటిలో కొట్టుకుపోయారు. మరో వీడియోలో ఓ పెద్ద బ్రిడ్జి వరద ఉద్ధృతికి నిలబడలేకపోయింది. నీటితో పాటు కొట్టుకుపోయింది. డాయిమోన్ హూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో మరింత భయానక దృశ్యాలు ఉన్నాయి.
ఆ వీడియోలో.. పర్యాటకులు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వరద నీరు వారి వైపు దూసుకువచ్చింది. దీంతో భయపడిపోయిన పర్యాటకులు కొండ మీదకు పరుగులు తీయటం మొదలెట్టారు. అయితే, కొంతమంది పర్యాటకులు వరద నుంచి తప్పించుకోలేకపోయారు. వరద నీరు వారిని ముంచెత్తింది. పదుల సంఖ్యలో జనం నీటిలో కొట్టుకుపోయారు. వరదల కారణంగా ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇళ్లు, వాహనాలు, భవనాలు, బ్రిడ్జ్‌లు, డ్యామ్‌లు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో బస్సులు, కార్లు బురదలో కూరుకుపోయాయి.
ఇవి కూడా చదవండి
క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకే ఊహాజనిత వ్యాఖ్యలు.. జగన్‌పై మంత్రి ఫైర్
రామ్‌దేవ్ బాబా నా బెడ్‌రూమ్‌లో గబ్బిలంలా వేలాడుతున్నారా?.. కంగన ఘాటు వ్యాఖ్యలు