Share News

పరాఠా నుంచి సమోసా వరకు.. ఆఫీస్‌లో ఇతని నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:57 PM

సాధారణంగా ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు పని ఒత్తిడిలో పడి భోజనానికి కూడా సమయం కేటాయించలేకపోతుంటారు. కొందరైతే కాఫీ.. తేలికపాటి స్నాక్స్‌తోనే రోజంతా గడిపేస్తుంటారు. కానీ నీరజ్ భాటియా అనే ఉద్యోగి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.

పరాఠా నుంచి సమోసా వరకు.. ఆఫీస్‌లో ఇతని నిర్వాకం చూస్తే..
Office Food Diary

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు పని ఒత్తిడిలో పడి భోజనానికి కూడా సమయం కేటాయించలేకపోతుంటారు. కొందరైతే కాఫీ.. తేలికపాటి స్నాక్స్‌తోనే రోజంతా గడిపేస్తుంటారు. కానీ నీరజ్ భాటియా అనే ఉద్యోగి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. రకరకాల వంటకాలతో నిండిన టిఫిన్ బాక్సులను ఆఫీసుకు తీసుకెళ్తూ.. గంటగంటకూ ఏదో ఒకటి తింటూ కనిపిస్తున్న అతని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆహారపు అలవాట్లను క్రమం తప్పకుండా పంచుకునే నీరజ్ వీడియోకు ఎక్స్‌ (X)లోనూ భారీ స్పందన లభించింది. ఈ వీడియోకు 2 కోట్లకు పైగా వీక్షణలు రావడంతో అతను రోజంతా ఇన్ని రకాల ఆహార పదార్థాలను ఎలా తింటున్నాడంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


నీరజ్‌ ఆఫీస్ ఫుడ్ డైరీలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ రకరకాల వంటకాలు కనిపిస్తాయి. ఉదయం 9 గంటలకు పనీర్ పరాఠాతో మొదలయ్యే అతని ఆహార ప్రయాణం.. 10 గంటలకు మాకరోనీ, 11 గంటలకు నల్ల శనగలు, మధ్యాహ్నానికి పండ్లతో కొనసాగుతుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్న అనంతరం, 1 గంటకు సప్లిమెంట్స్ తీసుకుంటాడు. 1:30 గంటలకు అన్నం, పప్పు, కూరలు, సలాడ్‌తో భోజనం చేస్తాడు. ఆ తర్వాత కూడా అతని తినే కార్యక్రమం ఆగదు. మధ్యాహ్నం 2:30 గంటలకు గోల్గప్పే తినేందుకు బయటకు వెళ్లగా, 3:30 గంటలకు గ్రీన్ టీ, 4:30 గంటలకు సమోసాలు ఆస్వాదిస్తాడు. ఇలా ఒకే పనిదినంలో ఇన్ని రకాల ఆహార పదార్థాలను తింటున్న నీరజ్ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Updated Date - Oct 14 , 2026 | 06:00 PM