మినీ లైబ్రరీగా ఆటో-రిక్షా... వీడియో వైరల్
ABN , Publish Date - Apr 28 , 2026 | 02:56 PM
మైసూరులో ఒక ఆటో డ్రైవర్ చేపట్టిన వినూత్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: మైసూరులో ఒక ఆటో డ్రైవర్ చేపట్టిన వినూత్న ప్రయత్నం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ప్రయాణికులను కేవలం గమ్యస్థానానికి చేర్చడమే కాకుండా.. వారికి జ్ఞానాన్ని, ఆహ్లాదాన్ని పంచాలనే ఉద్దేశంతో తన ఆటోను మినీ లైబ్రరీగా మార్చేశారు. సాధారణంగా ఆటో ప్రయాణం అంటే ట్రాఫిక్ గందరగోళం, హడావిడి గుర్తుకొస్తాయి. కానీ ఈ ఆటోలో ప్రయాణిస్తే మాత్రం ఒక ప్రశాంతమైన గ్రంథాలయంలో ఉన్న అనుభూతి కలుగుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రయాణికులు చదువుకోవడానికి వీలుగా ఆటోలో వివిధ రకాల పుస్తకాలు కనిపిస్తున్నాయి. పుస్తకాలు చదివే వాళ్లకు బోర్ కొట్టకుండా ఉచితంగా చాక్లెట్లు కూడా అందుబాటులో ఉంచారు. అంతేకాదు.. కొన్ని చీటీలపై స్ఫూర్తిదాయకమైన సూక్తులు, సందేశాలు ప్రింట్స్ కనిపిస్తున్నాయి. ఈ వినూత్నమైన ఆటోకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. అది కాసేపట్లోనే వైరల్‌గా మారింది. వేలాది మంది లైక్ చేయడమే కాకుండా, ఆ డ్రైవర్ యొక్క సృజనాత్మకత, సామాజిక బాధ్యతను కొనియాడుతున్నారు.
ఈ వీడియో by.nanthithaparkavi అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘డిజిటల్ యుగంలో పుస్తక పఠనాన్ని మర్చిపోతున్న తరుణంలో, ఇలాంటి అద్భుత ఆలోచన అభినందనీయం’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘టెక్నాలజీ పెరిగినా అక్షరం విలువ తగ్గలేదు అని ఈ ఆటో డ్రైవర్ నిరూపించారు’.. అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండొద్దు: మంత్రి మండిపల్లి
Read Latest AP News And Telangana News And International News And Telugu News