పోర్ట్‌లో ప్రమాదం.. ఓడపై పడ్డ భారీ క్రేన్.. భీకర విధ్వంసం..
ABN , Publish Date - Aug 31 , 2026 | 07:51 AM
ముంబై పోర్టులో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. కార్గోను లేపుతుండగా ఓ క్రేన్ ప్రమాదానికి గురైంది. పక్కనే ఉన్న ఓడపై పడింది. దీంతో క్రేన్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు క్రేన్ ఆపరేటర్లకు గాయాలు అయ్యాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: ముంబై పోర్టులో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. కార్గోను లేపుతుండగా ఓ క్రేన్ ప్రమాదానికి గురైంది. పక్కనే ఉన్న ఓడపై పడింది. దీంతో క్రేన్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు క్రేన్ ఆపరేటర్లకు గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ముంబై పోర్ట్‌లో ‘వియన్నా’ అనే ఓడ నుంచి రెండు క్రేన్ల సాయంతో 140 మెట్రిక్ టన్నుల బరువున్న భారీ కార్గోను పైకి లేపసాగారు.
కార్గోను లేపుతున్న సమయంలో ఓ క్రేన్‌కు ఉన్న బెల్ట్ బ్యాలెన్స్ తప్పి ఊడిపోయింది. దీంతో ఆ సరకు బరువంతా ఒక్కసారిగా రెండో క్రేన్‌పైకి పడింది. ఆ భారీ బరువును తట్టుకోలేక రెండో క్రేన్ వెనుక భాగం గాల్లోకి లేచింది. ఆ వెంటనే క్రేన్ ముందు భాగం వేగంగా వెళ్లి ఓడను బలంగా ఢీకొట్టింది. క్రేన్‌లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రంజిత్ సింగ్, నిశాంత్ సింగ్ అనే ఇద్దరు క్రేన్ ఆపరేటర్లు గాయపడ్డారు.
వారిని వెంటనే చికిత్స నిమిత్తం ముంబైలోని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ముంబై పోర్ట్ ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
కౌంటీ ఛాంపియన్‌షిప్: ఆకిబ్ నబీకి సర్‌ప్రైజ్ ఛాన్స్.. సర్రే జట్టు తరఫున..
వచ్చే నెలలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం