సముద్రంలోకి దూకిన మహిళ.. ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్..
ABN , Publish Date - Jun 01 , 2026 | 01:44 PM
ఆత్మహత్య చేసుకోవడానికి సముద్రంలోకి దూకిన మహిళను రక్షించడం కోసం ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ప్రాణాలకు పనంగా పెట్టాడు. సముద్రంలోకి దూకి ఆమెను కాపాడాడు.
ముంబై, జూన్ 1: ఆత్మహత్య చేసుకోవడానికి సముద్రంలోకి దూకిన మహిళను రక్షించడం కోసం ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ప్రాణాలకు పనంగా పెట్టాడు. సముద్రంలోకి దూకి ఆమెను కాపాడాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ముంబైకి చెందిన 46 ఏళ్ల ఓ మహిళ సముద్రం దగ్గరకు వచ్చింది. 11.25 గంటల ప్రాంతంలో సముద్రంలోకి దూకింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ జయేశ్ మాలి అది గమనించాడు.
ఆలస్యం చేయకుండా వెంటనే సముద్రంలోకి దూకాడు. ఆమెను ఒడ్డుకు తీసుకురావటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న జనం జయేశ్‌కు సాయం చేశారు. అందరూ కలిసి మహిళను ప్రాణాలతో ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆ వెంటనే ఆమెను జీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై పోలీస్ శాఖ ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు పోలీస్ కానిస్టేబుల్ జయేశ్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పశ్చిమ బెంగాల్‌లో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 35మంది ప్రమాణస్వీకారం..
పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే.. ఆ ఆనందమే వేరు: సీఎం చంద్రబాబు