లోకల్ ట్రైన్‌లో మహిళకు సీమంతం.. ఆమె సంతోషానికి అవధులు లేవు..
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:59 PM
ముంబై లోకల్ ట్రైన్‌లో కొంతమంది మహిళలు గర్భిణికి సీమంతం చేశారు. సర్‌ప్రైజ్ సీమంతంతో గర్భిణి ఎంతో సంతోషించింది. ఈ సీమంతానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబై లోకల్ ట్రైన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రద్దీ. ఆ తర్వాతి స్థానంలో గొడవలు, ప్రమాదాలు ఉంటాయి. అయితే, ముంబై లోకల్ ట్రైన్‌లో మనసుకు హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు లోకల్ ట్రైన్‌లో గర్భిణికి సీమంతం చేశారు. సర్‌ప్రైజ్ సీమంతంతో గర్భిణి ఎంతో సంతోషించింది. ఈ సీమంతానికి సంబంధించిన వీడియోను దివ్య కదమ్ అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా మంది ఆ వీడియోను చూశారు.
35 వేలకు పైగా వీడియోను లైక్ చేశారు. అలాగే 179 మంది కామెంట్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే... లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో గర్భిణి సీమంతం కోసం ఏర్పాట్లు అద్భుతంగా జరిగాయి. సీటు దగ్గరగా ఉన్న ట్రైన్ పార్టిషన్ వాల్స్‌కు బ్యానర్, పింక్ కలర్ బెలూన్స్ కట్టారు. హిందూ సంప్రదాయం ప్రకారం బొట్టుపెట్టి ఆమెకు సీమంతం చేశారు. తర్వాత స్వీట్స్ పంచుకుని తిన్నారు. గర్భిణితో సెల్ఫీలు, వీడియోలు సైతం దిగారు. ఇదంతా ట్రైన్ రన్నింగ్‌లో ఉండగానే జరిగింది. ట్రైన్‌లో జరిగిన ఈ సీమంతాన్ని గర్భిణి ఎంతో సంతోషంతో ఎంజాయ్ చేసింది.
ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘ఈ వీడియోను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. గర్భిణికి సీమంతం చేసిన ఆ మహిళలు ధన్యవాదాలు’..‘ముంబై లోకల్ ట్రైన్‌లో సీట్ల కోసం గొడవపడే ఆడవారిని చూశాను. ఇలా తోటి మహిళకు సీమంతం చేసే ఆడవారిని ఇప్పుడే చూస్తున్నా’.. ‘ఆ గర్భిణికి ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
డిప్యూటీ బ్యాంక్ మేనేజర్ బెట్టింగ్ పిచ్చి.. లాకర్ల నుంచి రూ. 3.5 కోట్ల బంగారం దొంగిలించి..
తెలంగాణ రైతాంగానికి గుడ్‌న్యూస్.. పెండింగ్ బకాయిలు క్లియర్..