ధనుష్‌తో డేటింగ్.. రూ. 10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ రాదు..
ABN , Publish Date - Feb 15 , 2026 | 07:56 PM
సోషల్ మీడియాలో ధనుష్, మృణాల్ గురించి వార్తలు తరచుగా వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలపై ధనుష్ స్పందించకపోయినా.. మృణాల్ మాత్రం స్పందిస్తూనే ఉన్నారు. తనకు, ధనుష్‌కు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేస్తూనే ఉన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: తమిళ సూపర్ స్టార్ ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమించుకుంటున్నారని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరికొన్ని నెలల్లో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో ధనుష్, మృణాల్ గురించి వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలపై ధనుష్ స్పందించక పోయినా.. మృణాల్ మాత్రం స్పందిస్తూనే ఉన్నారు. తనకు, ధనుష్‌కు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేస్తూనే ఉన్నారు. తాజాగా, ఓ జాతీయ మీడియా ధనుష్‌తో రిలేషన్ రూమర్స్‌పై మృణాల్‌ను ఓ ప్రశ్న అడిగింది.
ఆ ప్రశ్నకు మృణాల్ ఠాకూర్ వ్యంగ్యంగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నాకు పీఆర్ టీమ్ లేదు. ఓ పీఆర్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. నన్ను నేను రక్షించుకోవాలంటే కచ్చితంగా పీఆర్ టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిందే. కానీ, నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. 3 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు ఖర్చు పెట్టినా ఇంత పబ్లిసిటీ రాదేమో. అందుకే, ఫేక్ రూమర్స్ ప్రచారం చేస్తున్న వారికి నా ధన్యవాదాలు. ఈ రూమర్స్‌లోకి వేరే వాళ్లను లాగాలని అనుకోవటం లేదు’..
‘నేను అన్ని విషయాల్లో చాలా ఓపెన్‌గా ఉంటా. నా జీవితంలో ప్రేమ, పెళ్లి లాంటివి ఏమైనా ఉంటే అందరికీ చెబుతాను. నేను సినిమా ఫీల్డ్‌లో కెమెరాతో రొమాన్స్ చేయడానికి మాత్రమే ఉన్నాను. నాతో కెమెరా మాత్రమే ఎప్పుడూ ఉండాలని కోరుకుంటా’ అని అన్నారు. కాగా, మృణాల్ ప్రస్తుతం ‘దో దివానే షెహర్ మే’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి..
బడ్జెట్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపు
భారత్ vs పాకిస్థాన్, ఈ సారి కూడా షేక్‌హ్యాండ్ లేదు..