Share News

మద్యం దుకాణంలో దూరిన కోతి.. చివరకు ఏం చేసిందంటే!

ABN , Publish Date - Sep 27 , 2026 | 07:36 AM

జార్ఖండ్‌లో ఓ కోతి చేసిన పని ఇప్పుడు స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. మద్యం దుకాణంలోకి చొరబడిన ఆడ కోతి.. ఓ సీసాలోని మద్యం తాగి, చివరకు అక్కడే నిద్రపోవడంతో దుకాణదారులు, స్థానికులు ఆశ్చర్యపోయారు.

మద్యం దుకాణంలో దూరిన కోతి.. చివరకు ఏం చేసిందంటే!
Monkey Enters Liquor Shop

ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌లోని రాంచీలో ఓ ఆడ కోతి చేసిన వింత పని ప్రస్తుతం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఓర్మాన్‌ఝీలోని బ్లాక్ చౌక్ ప్రాంతంలోని మద్యం దుకాణంలోకి అకస్మాత్తుగా ప్రవేశించిన కోతి.. కొద్దిసేపు దుకాణమంతా తిరిగింది. అనంతరం అక్కడ ఉంచిన ఓ మద్యం సీసాను పట్టుకుని అందులోని మద్యం తాగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికే కోతి నిద్రమత్తులోకి వెళ్లి.. దుకాణం ప్రాంగణంలోనే పడుకుని నిద్రపోయింది. దీంతో దుకాణదారులు.. అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కోతి చేసిన ఈ అసాధారణ చర్యను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.


విషయం తెలియడంతో కోతిని సురక్షితంగా బయటకు తీసుకెళ్లేందుకు రెస్క్యూ బృందం అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. జంతువుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దానిని అదుపులోకి తీసుకుని బయటకు తరలించేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇవీ చదవండి:

బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్‌ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్‌ కూల్‌గా.!

పెన్సిల్‌ మొనపై ‘చిన్న’ గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!

Updated Date - Sep 27 , 2026 | 09:22 AM