దొంగకు షాకింగ్ అనుభవం.. రైలు కిటికీకి వేలాడుతూ 9 కిలోమీటర్లు..
ABN , Publish Date - Jul 13 , 2026 | 09:12 AM
బిహార్‌లో ఓ దొంగకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ప్రయాణికుడి మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏకంగా తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.
బిహార్‌లో ఓ దొంగకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ప్రయాణికుడి మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏకంగా తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Bihar train theft).
ఈ ఘటన బిహార్‌లోని బరౌనీ-కటిహార్ రైల్వే మార్గంలో జరిగింది. జనహిత్ ఎక్స్‌ప్రెస్, మాన్సీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే నిందితుడు కిటికీ ద్వారా చేయి లోపలికి పెట్టి ప్రయాణికుడి మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే లోపల ఉన్న ప్రయాణికులు వెంటనే అతడి చేతిని గట్టిగా పట్టుకున్నారు. రైలు కదలడం ప్రారంభమైనా వారు అతడిని వదలకుండా పట్టుకుని ఉన్నారు (Mobile phone thief).
నిందితుడు రైలు బయట వేలాడుతూ ప్రాణభయంతో ప్రయాణించాల్సి వచ్చింది. మార్గమధ్యంలో అతడిని విడిపించేందుకు కొందరు ప్రయత్నించినప్పటికీ ప్రయాణికులు అవకాశం ఇవ్వలేదు. చివరకు రైలు ఖగారియా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత అతడిని ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు (viral train video).
పోలీసులు నిందితుడిని భగల్‌పూర్ జిల్లా నవగాచియా ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఫఖ్రుద్దీన్ అలియాస్ ఛోటూగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ ఘటనలో ప్రయాణికులకు లేదా నిందితుడికి ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆమిర్ ఖాన్ మూడో వివాహం లవ్ జీహాద్.. మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..