Heartwarming Viral Video: మనవడి సర్‌ప్రైజ్.. వృద్ధాప్యంలో మొదటి సారి విమాన ప్రయాణం
ABN , Publish Date - Jan 16 , 2026 | 08:25 AM
విమానం ఎక్కాలనుకున్న ఓ వృద్ధ జంట కోరిక మనవడి కారణంగా నెరవేరింది. మొదటిసారి విమానం ఎక్కిన వారి సంతోషం మాటల్లో చెప్పటం కష్టమే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణం అనేది ఎంతో మంది కల. జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని అనుకుని, ఆర్థిక సమస్యలో ఆలోచనల్ని చంపుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. విమానం ఎక్కాలనుకున్న ఓ వృద్ధ జంట కోరిక మనవడి కారణంగా నెరవేరింది. మొదటి సారి విమానం ఎక్కిన వారి సంతోషం మాటల్లో చెప్పటం కష్టమే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ సంగతేంటంటే.. ఉత్తర భారతదేశానికి చెందిన అంకిత్‌రానా అనే వ్యక్తి తన తాత, నాన్నమ్మలతో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉన్నాడు.
వృద్ధ జంటతో కామెడీ వీడియోలు చేసి చాలా ఫేమస్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడ్ని ఏకంగా 6 లక్షల మంది ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రమోషన్ల కారణంగా అతడు బాగానే సంపాదించాడు. తన ఉన్నతికి కారణం అయిన తాత, నాన్నమ్మలకు ఏదైనా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. ఇందుకోసం దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేశాడు. చకచకా వీసా, పాస్‌పోర్ట్ పనులు అయిపోయాయి. వారికి వాటి గురించి కొంచెం కూడా ఐడియా లేదు. నిన్న నేరుగా వారిని ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత విమానంలో దుబాయ్ వెళుతున్నామని వారికి చెప్పాడు. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
విమానంలో కూర్చున్న తర్వాత వృద్ధురాలి కళ్లలో మాటల్లో చెప్పలేని సంతోషం కనిపించింది. ప్రస్తుతం ముగ్గురూ దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. అంకిత్ దుబాయ్ టూర్ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో వరుసగా షేర్ చేస్తున్నాడు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నువ్వు చాలా గ్రేట్ యంగ్ మ్యాన్. మీ తాత, నాన్నమ్మల కళ్లలో సంతోషం చూస్తుంటే నాకు చాలా హ్యాపీ ఉంది. నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి’..‘ఈ రోజు నేను చూసిన మంచి వీడియో ఇదే. నువ్వు ఇలాంటివి ఇంకెన్నో చేయాలి. వాళ్లను కడవరకు బాగా చూసుకోవాలి’ అని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
భారీ కోడి పందెం.. ఏకంగా రూ. 1.53 కోట్లు గెలిచాడు
ఆ కుక్కకు ఏమైంది.. నాలుగు రోజులుగా దేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు