Winter Shoe Drying Trick: ఇతడి తెలివికి సలాం.. తడిచిపోయిన బూట్లను ఆరబెట్టడానికి సూపర్ ట్రిక్..
ABN , Publish Date - Jan 15 , 2026 | 11:49 AM
మనదేశంలో చాలా మంది సామాన్యులు అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు.
మన దేశంలో చాలామంది సామాన్యులు అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. (shoe drying trick).
chanda_and_family_vlogs అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియో ప్రకారం.. బూట్లను ఆరబెట్టడానికి ఓ వ్యక్తి సూపర్ ట్రిక్ చెబుతున్నాడు. తడిసిన బూట్లను నేరుగా తాడుకు తగిలించడం వల్ల నీరు బయటకు వెళ్లదని చెబుతున్నాడు. దీనివల్ల బూట్లు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుందని అతను వివరించాడు. ఒక పాలిథిన్ కవర్‌ను తీసుకుని దానిని తాడుకు రివర్స్‌లో వేలాడదీశాడు. ఆ కవర్ రెండు హ్యాండిళ్ల మధ్య బూట్లను ఉంచాడు (dry shoes quickly).
ఇలా చేయడం వల్ల బూట్లు త్వరగా ఆరిపోతాయని చెబుతున్నాడు (winter footwear hack). ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు. రెండు వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అద్భుతమైన ఆలోచన అని ఒకరు కామెంట్ చేశారు. బూట్లను అరబెట్టడానికి తాను చాలా కష్టపడుతున్నానని, ఈ ఐడియా ట్రై చేస్తానని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..