Share News

ఇతడి గుండె ధైర్యానికి సలాం కొట్టాల్సిందే.. ఎలాంటి స్టంట్ చేశాడో చూడండి..

ABN , Publish Date - Mar 01 , 2026 | 10:39 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే అద్భుతమైన పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

ఇతడి గుండె ధైర్యానికి సలాం కొట్టాల్సిందే.. ఎలాంటి స్టంట్ చేశాడో చూడండి..
Viral shocking stunt

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే అద్భుతమైన పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Dangerous stunt video).


danejacksonkayak అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక భారీ జలపాతం కనబడుతోంది. కొండపై నుంచి నీరు చాలా వేగంగా కిందకు దూకుతోంది. ఆ నీటి ప్రవాహంలో ఒక వ్యక్తి సైలింగ్ చేసుకుంటూ వచ్చాడు. నేరుగా ఆ నీటితో పాటు కొండ కిందకు వచ్చేశాడు. అంత ఎత్తు నుంచి కిందకు పడితే బతికే అవకాశం చాలా తక్కువని ఎవరికైనా అర్థమవుతుంది. అయితే అతడు మాత్రం క్షేమంగా బయటకు వచ్చేశాడు. ఆ వీడియో చూడడానికే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది (Astonishing viral footage).


ఈ ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న వ్యక్తి పేరు డాన్ జాక్సన్ (Trending stunt clip). అతడు తరచుగా ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటాడు. ఈ అద్భుతమైన స్టంట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 17 వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అతడి ప్రతిభను ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌పై దాడులు.. భారత్‌కు భారీ నష్టం తప్పదా..?


బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 01 , 2026 | 10:39 AM