Share News

ఇది కదా ధ్యానం అంటే.. భారీ వర్షంలో ఇతడి నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Aug 27 , 2026 | 04:38 PM

కుండపోత వర్షం.. చుట్టూ జోరుగా నీరు.. అయినా అతడి ధ్యాస మాత్రం యోగాపైనే! వర్షంలో తడుస్తూనే పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్న వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కదా ధ్యానం అంటే.. భారీ వర్షంలో ఇతడి నిర్వాకం చూస్తే..
Man Meditates in Heavy Rain

ఇంటర్నెట్ డెస్క్: ఓ వైపు కుండపోత వర్షం.. చుట్టూ నీరు.. పక్కనే కొంతమంది గేమ్స్ ఆడుతున్నారు.. అయినా అతడి ధ్యాస మాత్రం యోగాపైనే. వర్షంలో తడుస్తూనే పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్న వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత ఇది కదా ధ్యానం అంటే.. నెటిజన్లు అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ వ్యక్తి కుండపోత వర్షంలోనూ ఏమాత్రం చలించకుండా యోగా, ధ్యానం చేస్తూ కనిపించాడు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. తడి గడ్డిపై పద్మాసనంలో ప్రశాంతంగా కూర్చుని తన సాధనను కొనసాగించాడు. చుట్టుపక్కల ఆడుకుంటున్న కొందరు వర్షంలో పరుగులు తీస్తున్నా.. అతడి ఏకాగ్రత మాత్రం ఏమాత్రం చెదరలేదు. టీషర్ట్ ధరించిన ఆ వ్యక్తి ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీనిని ‘వాటర్‌ప్రూఫ్ యోగా’ అంటూ సరదాగా పిలుస్తుండగా.. మరికొందరు నిజమైన క్రమశిక్షణ.. అంకితభావానికి ఇదే నిదర్శనం అంటూ ప్రశంసిస్తున్నారు. చాలామందికి ఈ వ్యక్తి స్ఫూర్తిగా నిలిచాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా మనసులో సంకల్పం ఉంటే లక్ష్యాన్ని కొనసాగించవచ్చని ఈ వీడియో చెబుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 05:01 PM