Share News

Makar Sankranti 2026: సంక్రాంతి పండుగ జనవరి 14 నుంచి 15కు ఎందుకు మారింది.. ఆసక్తికర కారణమేంటంటే..

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:45 PM

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంలో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. మకర సంక్రాంతి సౌర చక్రం ఆధారంగా ఉంటుంది. అందువల్ల, ఇది దాదాపు ప్రతి సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం తేదీ మారింది.

Makar Sankranti 2026: సంక్రాంతి పండుగ జనవరి 14 నుంచి 15కు ఎందుకు మారింది.. ఆసక్తికర కారణమేంటంటే..
Makar Sankranti 2026

తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండగ అంటే సంక్రాంతి. దేశవ్యాప్తంగా కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. దేశంలోని పలు ప్రాంతాలలో పొంగల్, లోహ్రీ, మాఘ బిహు, కిచ్డి వంటి వివిధ పేర్లతో పండుగ చేసుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంలో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. మకర సంక్రాంతి సౌర చక్రం ఆధారంగా ఉంటుంది. అందువల్ల, ఇది దాదాపు ప్రతి సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. అయితే ఇటీవలి కాలంలో సంక్రాంతి పండుగ తేదీ మారింది (Makar Sankranti significance).


చాలా సంవత్సరాల పాటు జనవరి 14వ తేదీనే సంక్రాంతిని జరుపుకునే వాళ్లం. అయితే 2008 నుంచి మాత్రం జనవరి 15వ తేదీన సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని వెనుక ఓ ఆసక్తికర కారణం ఉందట. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యలో వచ్చిన చిన్న మార్పు వల్లే సంక్రాంతి పండుగ జనవరి 14 నుంచి 15కు మారిందట. భూమి తన కక్ష్యలో తిరుగుతూ స్వల్పంగా దిశ మార్చుకోవడం వల్ల, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం కొద్దిగా మారుతుంది (science behind Makar Sankranti).

sankranti.jpg


ప్రతి సంవత్సరం ఈ మార్పు సుమారు 20 నిమిషాలు ఉంటుంది. ఈ 20 నిమిషాల తేడా వల్ల, సుమారు 72 సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతి తేదీ ఒక రోజు తర్వాతకు జరుగుతుంది (Sankranti festival India). అందుకే 1935 నుంచి 2007 వరకు జనవరి 14న ఉన్న సంక్రాంతి, 2008 నుంచి జనవరి 15కి మారింది. ఇలా 2080 సంవత్సరం వరకు జనవరి 15వ తేదీనే సంక్రాంతి వస్తుందట. 2081వ సంవత్సరం నుంచి మాత్రం సంక్రాంతి జనవరి 16కు మారుతుందట.


ఇవి కూడా చదవండి..

చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 14 , 2026 | 01:26 PM