Share News

మెదడును తినే సూక్ష్మక్రిమి బారిన పడి 8 ఏళ్ల బాలిక మృతి

ABN , Publish Date - Aug 24 , 2026 | 08:58 PM

అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మెదడును తినేసే సూక్ష్మక్రిమి బారిన పడి ఓ 8 ఏళ్ల బాలిక కన్నుమూసింది.

మెదడును తినే సూక్ష్మక్రిమి బారిన పడి 8 ఏళ్ల బాలిక మృతి
Girl Dies from Contracting brain eating amoeba

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మెదడును తినేసే సూక్ష్మక్రిమి బారిన పడి ఓ 8 ఏళ్ల బాలిక కన్నుమూసింది. లూసియానా రాష్ట్రంలో ఈ ఘటన వెలుగు చూసింది. బాలికను లిలియన్ స్మార్ట్‌గా పోలీసులు గుర్తించారు. రూస్టన్ నగరంలో చికిత్స పొందుతూ ఆమె శనివారం కన్నుమూసింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇటీవల రూస్టన్ నగరానికి వాయువ్య దిశగా 30 కిలోమీటర్ల దూరంలోని ఉన్న క్లెయిబోర్న్ అనే కొలనులో బాలిక ఈతకని వెళ్లి ఈ ప్రాణాంతక సూక్ష్మక్రిమి బారిన పడింది. అనంతరం అనారోగ్యం తలెత్తడంతో ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఆగస్టు 15 నుంచి చికిత్స పొందుతున్న ఆమె శనివారం కన్నుమూసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.


అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బాలిక నైగ్లేరియా ఫౌలెరీ అనే అమీబా బారిన పడింది. నీటి ద్వారా ముక్కులోకి ప్రవేశించే ఈ క్రిమి మెదుడులోకి చేరాక మెనింజోసెఫలైటిస్‌కు దారి తీస్తుంది. ఫలితంగా మెదడుపూర్తిగా దెబ్బతిని బాధితులు కన్నుమూస్తారు. 97 శాతం కేసుల్లో మరణాలు సంభవిస్తాయని అధికారులు తెలిపారు. క్రిమి బారిన పడ్డ 12 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. మొదట్లో తీవ్ర తలనొప్పి, జ్వరం, వాంతులు, కడుపులో తిప్పడం వంటి సమస్యలు వస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ మెడ పట్టేసినట్టు ఉండటం, ఫిట్స్ వంటివి మొదలై ఆ తరువాత బాధితులు కోమాలోకి వెళ్లి చివరకు కన్నుమూస్తారు.


ఈ వార్తలనూ చదవండి:

ముంబై లోకల్ రైల్లో యువతుల పాట్లు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే

జీవితమంతా భిక్షాటన చేస్తూ.. పైసా పైసా కూడబెట్టింది.. చివరికి..

Updated Date - Aug 24 , 2026 | 09:06 PM