లిటిల్ ఫ్యాన్ ఆవేదన.. చిన్నారికి విజయ్, రష్మిక ఆహ్వానం
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:47 AM
సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ లిటిల్ ఫ్యాన్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియో విజయ్, రష్మికల దృష్టికి వెళ్లింది. కొత్త జంట చిన్నారి ఫ్యాన్ వీడియోపై స్పందించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో అతి కొద్ది మంది బంధు, మిత్రుల మధ్య ఈ పెళ్లి జరిగింది. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో పెళ్లి రిసెప్షన్ అత్యంత ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు. రిసెప్షన్‌కు కంటే ముందు విజయ్, రష్మికల జంట దేశ వ్యాప్తంగా అభిమానుల కోసం స్వీట్లు పంపిణీ చేసింది. విరోష్ టీమ్ ఎంపిక చేసిన పలు నగరాల్లో చిన్న చిన్న స్వీట్ బాక్స్‌లు పంచి పెట్టింది.
వైరల్ వీడియోపై స్పందించిన విరోష్
సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ లిటిల్ ఫ్యాన్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ‘విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి అయింది కదా.. అప్పుడు మనల్ని కూడా పిలవొచ్చు కదా పెళ్లికి. ఫ్యాన్స్‌కు లడ్డూలు పంచారు.. అన్నదానం చేశారు. నేను కూడా ఫ్యాన్సే కదా.. మీరు కూడా రీల్సే చేస్తున్నారు కదా.. నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా.. పిలిస్తే ఏమైతుందంట. ఈ వీడియో వాళ్లకు షేర్ చేయండి.’ అని ఆ చిన్నారి అంది.
ఈ వీడియో వైరల్‌గా మారి విజయ్, రష్మికల దృష్టికి వెళ్లింది. కొత్త జంట ఈ వీడియోపై స్పందించింది. ‘బుజ్జితల్లీ.. ఇంటికి పిలుస్తా లంచ్‌కి.. నీ ఫేవరెట్ ఫుడ్, స్వీట్స్ నాకు చెప్పు. అన్నీ ఇంటిలో చేపించి మంచిగా తిందాము’ అని విజయ్ దేవరకొండ కామెంట్ చేశారు. ‘అయ్యో.. నీకు స్పెషల్‌గా ఇంట్లో చేపిద్దాం’ అంటూ ఇన్‌స్టాలో రష్మిక ఓ స్టోరీ పెట్టారు. ఓ చిన్నారి ఫ్యాన్ రిక్వెస్ట్‌పై విజయ్, రష్మిక స్పందించటం.. భోజనానికి పిలవటంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కామారెడ్డి చిన్నారుల ఘటన.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఏఎస్పీ
మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవి: సీఎం రేవంత్‌రెడ్డి